ఉత్తరాంధ్ర…మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వస్తున్న ప్రాంతం..ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు టీడీపీకి సపోర్ట్ గా ఉంటున్నాయి…ఏ ఎన్నికల్లోనైనా ఉత్తరాంధ్రలో టీడీపీ మంచి ఫలితాలే రాబట్టేది. కానీ గత ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడింది. మూడు జిల్లాల్లో దారుణమైన ఫలితాలు వచ్చాయి..జగన్ గాలిలో టీడీపీలో ఉన్న బడా నేతలు సైతం ఓటమి పాలయ్యారు. అసలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు కలిపి మొత్తం 34 సీట్లు ఉంటే..టీడీపీ కేవలం ఆరు సీట్లు మాత్రమే గెలుచుకుంది..మిగిలిన 28 సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.

అంటే ఉత్తరాంధ్రలో వైసీపీ వేవ్ ఎలా వీచిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక…ఉత్తరాంధ్రలో టీడీపీని ఇంకా వీక్ చేయాలని చెప్పి అనేక విధాలుగా రాజకీయం నడుపుతూ వచ్చింది. ఈ క్రమంలోనే కాస్త టీడీపీ బలం తగ్గినట్లు కనిపించింది..పైగా స్థానిక ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయాలని చవిచూసింది. దీంతో ఉత్తరాంధ్రలో టీడీపీ పని అయిపోయిందనే పరిస్తితికి వచ్చింది.కానీ వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, వైసీపీ ఎమ్మెల్యేలపై ఊహించని విధంగా ప్రజా వ్యతిరేకత పెరగడం, అదే సమయంలో టీడీపీ నేతలు నిదానంగా పుంజుకోవడంతో…ఉత్తరాంధ్రలో ఒక్కసారిగా పోలిటికల్ సీన్ మారిపోయింది. మూడు జిల్లాల్లో టీడీపీ బలం పెరిగినట్లు కనిపిస్తోంది..ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీ బలం బాగా పెరిగింది. ఇక విజయనగరంలో టీడీపీ ఇప్పుడుప్పుడే పికప్ అవుతుంది…జిల్లాలో కూడా పుజుకుంటే టీడీపీకి ఇంకా తిరుగుండదు.

ఇప్పటినుంచి టీడీపీ ఇంకా కష్టపడితే…వచ్చే ఎన్నికల్లో 20 పైనే సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది..అదే సమయంలో టీడీపీ-జనసేన పొత్తు ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వైసీపీ 7-8 సీట్లకే పరిమితం కావొచ్చు. అయితే ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు దూకుడుగా పనిచేయాల్సి ఉంది..వారు కూడా దూకుడుగా రాజకీయం చేస్తే..ఇంకా ఉత్తరాంధ్రలో టీడీపీకి తిరుగుండదు.
Discussion about this post