గత ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ సీనియర్లు సైతం తొలి యేదాది కాస్త సైలెంట్ అయ్యారు. ఇదే అదనుగా వైసీపీ వాళ్లు ఇంకేముందు ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టే రాదు… ఆయన పోటీ చేయరన్న గ్లోబెల్స్ ప్రచారాలు ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్లు ఒక్కసారిగా జూలు విదుల్చుతూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్లతో సింహనాదాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో పెదకూరపాడు పేరు చెపితే ఒకప్పుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు మాత్రమే వినిపించింది. ఏ ఎన్నిక జరిగినా బాబుకు అక్కడ తమ పార్టీ గెలుస్తుందన్న ఆశ ఎప్పుడూ ఉండేదే కాదు. అలాంటి టైంలో అసలు అక్కడ టీడీపీ తప్పా మరో పార్టీ, మరో నేత పేరు లేకుండా చేశాడు కొమ్మాలపాటి శ్రీధర్.

2009కు ముందు మంత్రిగా ఉన్న కొమ్మాలపాటి జోరు చూసే కన్నా పెదకూరపాడు వదిలేసి గుంటూరు వెస్ట్‌కు మారారు. రెండు ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన శ్రీధర్ గత ఎన్నికల్లో ఓడారు. ఆ ఓటమిలో జగన్ వేవ్‌తో పాటు స్థానిక కారణాలూ ఉన్నాయి. తొలి యేడాది శ్రీధర్ కాస్త సైలెంట్‌గా ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ వాళ్లు రెచ్చిపోయారు గ్లోబెల్స్ ప్రచారం స్టార్ట్ చేశారు. శ్రీధర్‌కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని కొందరు… ఆయన గుంటూరు వెస్ట్‌కు వెళ్లిపోతున్నారంటూ మరికొందరు ప్రచారం చేశారు.

శ్రీధర్ సవాల్‌తో కేడర్లో జోష్ :
వైసీపీ ప్రచారంతో టీడీపీ కేడర్ కూడా నిస్తేజంగా ఉంది. తాజాగా శ్రీధర్ నియోజకవర్గంలో దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో కూరపాడు నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుస్తున్నానని.. ఇక్కడ గెలిచేది తానే.. ముఖ్యమంత్రి అయ్యేది లోకేష్ కాదు… చంద్రబాబు అనే కుండబద్దలు కొట్టేశారు. ఇక నియోజకవర్గంలో కాస్త డల్‌గా కేడర్లో ఫుల్ జోష్ నింపారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబంపై ఎవరైనా అహంకారంతో వెళితే వాళ్లను భవిష్యత్తులో వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చేశారు. ఇక్కడ వైసీపీ వాళ్లు చేస్తోన్న అరాచకాలను తాను కూడా రాసిపెట్టుకుంటున్నాను.. సీనియర్ నాయకులు చెప్పినవి కూడా రాసిపెట్టుకుంటున్నాను.. ఏ గ్రామంలో ఏం జరిగాయో రేపు వడ్డీతో సహా చెల్లించే రోజులు దగ్గర పడుతున్నాయ్ అని వైసీపీ అరాచకాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఎవరో ఉడత ఊపులకు భయడపను.. బెదిరిపోను అంటూనే ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు చేతకాని.. సత్తాలేని ఎమ్మెల్యే అని.. ఆయన పాలనలో అభివృద్ధి నిల్ అని ఫైర్ అయ్యారు. వాస్తవంగా చెప్పాలంటే కూరపాడు నియోజకవర్గంలో కన్నా నాలుగు సార్లు గెలిచినా.. ఎన్ని సార్లు మంత్రిగా ఉన్నా.. శ్రీధర్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఇప్పుడు శంకర్రావు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కన్నా 2014- 19 ఐదేళ్లలో జరిగిన అభివృద్ధే ఎక్కువ.

శ్రీధర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో పనులు కాలేదు. రెండోసారి గెలవడం.. పార్టీ అధికారంలో ఉండడం.. ఈ నియోజకవర్గంలోని పంచారామ క్షేత్రమైన అమరావతి పేరుతో ఏపీ రాజధాని ఏర్పడడం.. ఇక్కడ రియల్ భూమ్‌తో పాటు అన్నీ కలిసొచ్చాయి. దీనికి తోడు శ్రీధర్ పదే పదే చంద్రబాబు దగ్గర పట్టుబట్టి కోట్లాది రూపాయలు కుమ్మరించి కూరపాడులో మరో 30 ఏళ్ల పాటు చూసుకోనంత అభివృద్ధి చేశారు.

ఆ వెలుగులు అన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిర్వీర్యం అయ్యాయి. గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ ప్రజల జీవనాదాయం, తలసరి ఆదాయం రెండూ పెరిగాయి. అయితే ఇప్పుడు అవన్నీ నేలమట్టం అయ్యాయి. ఇక్కడ వైసీపీని గెలిపించినా ఈ రెండున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి అయితే జీరోయే. ఏదేమైనా శ్రీధర్ కూరపాడు నుంచి నాలుగోసారి పోటీకి రెడీ అయిపోతున్నారు.. బాబు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇక వైసీపీ నుంచి ఎవరు రేసులో ఉంటారు ? ఈ రెండేళ్లలో చెప్పుకునేందుకు కొంతైనా డవలప్‌మెంట్ ఉంటుందా ? ఇంతేనా అన్నదే చూడాలి.

Discussion about this post