ఎవరోచ్చి బరిలో ఉన్న గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో తాను గెలవడం ఖాయమని వల్లభనేని వంశీ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. దమ్ముంటే గుడివాడ-గన్నవరంల్లో చంద్రబాబు-లోకేష్ పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. ఎవరు నిలబడిన తమ గెలుపుని ఆపలేరని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి గన్నవరం బరిలో నిలబడి తాను గెలుస్తానని వంశీ చెబుతున్నారు.


అయితే వంశీ కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి కారణం ఏంటి? గనవరంలో గెలవడం అంత ఈజీనా అంటే..ప్రస్తుతం అక్కడ రాజకీయం గమనిస్తే వంశీ గెలుపుకు అనుకూల వాతావరణం ఉందని విశ్లేషకులు అంటున్నారు. దానికి కారణం టిడిపికి బలమైన నాయకత్వం లేకపోవడమే అంటున్నారు. మామూలుగా గన్నవరం టిడిపికి కంచుకోట. గత రెండు ఎన్నికల్లో టిడిపి నుంచి వంశీ గెలిచారు. కానీ తర్వాత ఆయన వైసీపీ వైపుకు వెళ్లారు. వంశీ వైసీపీ వైపుకు వెళ్ళాక టిడిపి ఇంచార్జ్ గా బచ్చుల అర్జునుడుని నియమించారు.


కానీ బచ్చుల అంత ఎఫెక్టివ్ గా పనిచేయలేదు. దీంతో నియోజకవర్గంలో టిడిపి క్యాడర్ కొంతమేర వంశీ వైపుకు వెళ్లింది. పైగా బచ్చుల అనారోగ్యం వల్ల అక్కడ టిడిపి యాక్టివ్ గా లేదు. అంటే టిడిపికి బలమైన నాయకత్వం లేకపోవడం వల్ల వంశీ గెలుస్తానని ధీమాలో ఉన్నారని తెలుస్తోంది. అయితే గన్నవరం టిడిపి లో బలమైన నాయకుడుని తీసుకురావాలని అక్కడ క్యాడర్ కోరుకుంటుంది. అది కూడా కమ్మ నేతని దించాలని కోరుతున్నారు.

అప్పుడు వంశీని నిలువరించవచ్చు అని చెబుతున్నారు. ఎలాగో వైసీపీలో అంతర్గత పోరు ఉంది. యార్లగడ్డ వెంకట్రావు దుట్టా రామచంద్రరావు..వంశీకి యాంటీగా ఉన్నారు. ఇదే క్రమంలో యార్లగడ్డని టిడిపిలోకి లాగితే సీన్ మారుతుందని, గన్నవరంలో వంశీని సులువుగా నిలువరించవచ్చు అని చెబుతున్నారు. మొత్తానికైతే ఎన్నికల సమయానికి టిడిపిలో బలమైన నాయకుడుని పెడితే వంశీని గెలుపు కష్టమయ్యే ఛాన్స్ ఉంది.

