టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ జీవితంలో చాలామంది ప్రత్యర్ధులని ఎదురుకున్నారు. వారి నుంచి విమర్శలు కూడా ఎదురుకున్నారు. కానీ ఎక్కువగా బాబుని ఏ ప్రత్యర్ధి తిట్టలేదు. రాజకీయంగా విమర్శలు చేసేవారే తప్ప..వ్యక్తిగతంగా దూషణలు తక్కువ. కానీ కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు చంద్రబాబుని ఎన్ని రకాలుగా తిడుతున్నారో అందరికీ తెలిసిందే. అసలు ఎవరు తిట్టని విధంగా తిడుతున్నారు.

ఇలా బాబుని తిడుతున్న కొడాలి, వంశీలకు చెక్ పెట్టాలని టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తుంది. అయితే వారికి చెక్ పెట్టాలంటే మాటలతో ఎదురుదాడి చేస్తే సరిపోదు. వారిని వారి నియోజకవర్గాల్లో ఓడించే ప్రయత్నాలు చేయాలి. కానీ రెండుసార్లు కొడాలికి టీడీపీ చెక్ పెట్టలేకపోతుంది. గుడివాడలో గత రెండు పర్యాయాల నుంచి కొడాలిని ఓడించడంలో టీడీపీ ఫెయిల్ అవుతుంది. మరి ఈ సారి ఎన్నికలో ఏం చేస్తుందో చూడాలి.

కొడాలి విషయం పక్కనబెడితే…వంశీ తొలిసారి వైసీపీ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన గన్నవరం బరిలో వైసీపీ తరుపున నిలబడుతున్నారు. మరి అప్పుడు వంశీకి టీడీపీ చెక్ పెట్టాల్సిన అవసరముంది. వంశీకి గట్టి ప్రత్యర్ధిని పెట్టి చెక్ పెట్టాలి. లేకపోతే వంశీ గెలుపు ఆపడం అంత సులువు కాదు. మామూలుగానే వంశీకి ఫాలోయింగ్ ఎక్కువ. పైగా వంశీ టీడీపీని వీడాక గన్నవరంలో పార్టీ వీక్ అయింది.

బచ్చుల అర్జునుడు ఇంచార్జ్‌గా ఉన్నా సరే పెద్దగా ఎఫెక్టివ్ చూపించలేకపోతున్నారు. వంశీకి చెక్ పెట్టడం బచ్చులకు సాధ్యం కాదు. అలాంటప్పుడు బలమైన ప్రత్యర్ధిని వంశీపై దింపాలి. అది కూడా కమ్మ వర్గం నాయకుడైతే బాగుంటుందని గన్నవరం టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. గద్దె ఫ్యామిలీ నుంచి గద్దె అనురాధా బరిలో దిగితే ప్లస్ ఉంటుందని అంటున్నారు.


అదే సమయంలో పుట్టగుంట సతీష్‌ని పోటీకి దించిన వంశీకి గట్టి ఫైట్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. సతీష్ అయితే ఆర్ధికంగా, సామాజికంగా వంశీకి టఫ్ ఫైట్ ఇస్తారని అంటున్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో వంశీ విషయంలో చంద్రబాబు ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తారో?

Discussion about this post