కాపు వర్గానికి బ్రాండ్ గా ఉండే వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా పోలిటికల్ కెరీర్ అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. చాలాకాలం నుంచి రాజకీయాల్లో ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఎప్పుడో 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైసీపీలోకి వెళ్ళి పోటీ చేసిన గెలవలేదు. చివరికి 2019 ఎన్నికల ముందు ఆయన టిడిపిలోకి వచ్చిన విషయం తెలిసిందే.

కాకపోతే ఆయన టిడిపి నుంచి పోటీ చేయలేదు. కేవలం టిడిపి కోసం ప్రచారం చేశారు. ఇక టిడిపి ఓడిపోయి అధికారం కోల్పోయాక..ఆయన రాజకీయాల్లో సైలెంట్ అయ్యారు. కేవలం తన తండ్రి రంగాకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటే వాటిలో పాల్గొంటున్నారు. రంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాలు, విగ్రహావిష్కరణలకు వెళుతున్నారు. అప్పుడప్పుడు ఈయనతో కొడాలి నాని, వల్లభనేని కలుస్తున్నారు..దీంతో ఆయన వైసీపీలోకి వెళుతున్నారనే ప్రచారం వస్తుంది.

కానీ ఆయన ఎట్టి పరిస్తితుల్లోనూ వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికే కొడాలి..రాధాకు చాలా ఆఫర్లు ఇచ్చామని ఆయన రావడం లేదని చెప్పుకొచ్చారు. ఆ మధ్య నాదెండ్ల మనోహర్‌ని కలిశారు..దీంతో ఆయన జనసేనలోకి వెళ్తారని ప్రచారం మొదలైంది. అందులో కూడా వాస్తవం లేదని రాధా వర్గం చెప్పుకొచ్చింది. ఆయన ఈ సారి పార్టీ మారేది లేదని, కేవలం టిడిపిలోనే ఉంటారని అంటున్నారు. టిడిపిలో ఉంటే ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ సీటు ఖాళీ లేదు. ఆయన సొంత స్థానం విజయవాడ సెంట్రల్‌లో టిడిపి నేత బోండా ఉమా ఉన్నారు. దాదాపు అన్నీ స్థానాలు ఫుల్ గానే ఉన్నాయి. గన్నవరం ఒకటి కాస్త ఖాళీ అని చెప్పవచ్చు. మరి రాధాకు టిడిపిలో ఏ సీటు ఇస్తారనేది క్లారిటీ లేదు..అసలు రాధా పోటీ చేస్తారా? లేదా? అనేది తెలియడం లేదు.
