రాజకీయాల్లో సంతృప్తి.. అసంతృప్తి ఎప్పుడూ.. ఒకేలా ఉండవు. ప్రజాభిప్రాయం మారుతున్నట్టే.. అవి కూడా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రజలు.. ముఖ్యంగా ఎన్నికల్లో తురుపు ముక్కల్లా ఉపయోగపడే సామాజిక వర్గాల విషయంలో ముఖ్యంగా సంతృప్తి చాలా అవసరం. దీనిని కాపాడుకునేందుకు నాయకులు ప్రాధాన్యం ఇస్తారు. అయితే.. ఇప్పుడు ఈ విషయంలోనే మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెనుకబడుతున్నారని అంటున్నారు పరిశీలకులు. 2014 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం మొత్తంగా టీడీపీ నాయకుడు.. మాజీ మంత్రి దేవినేని ఉమా వెంట నడిచింది.

అయితే.. ఆయన మంత్రి అయిన తర్వాత.. కేవలం తనకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చుకున్నారని.. తనకు ఎన్నికల సమయంలో అన్ని విధాలా సాయం చేసిన కమ్మ వర్గాన్ని పక్కన పెట్టారనే టాక్ వచ్చింది. అయినప్పటికీ.. ఆయన దానిని పట్టించుకోకుండా.. తను చంద్రబాబు హవాతో అయినా గెలిచేస్తానని నమ్ముకున్నారు. అయితే.. ఈ లోపాన్ని గుర్తించిన వసంత.. కమ్మ వర్గాన్ని చేరదీశారు. ఎన్నికలకు ముందు వారికి అనేక హామీలు ఇచ్చారు. దీంతో ఎన్నికల సమయంలో కమ్మ సామాజిక వర్గం మొత్తంగా వసంత వెనుక నిలబడింది. దీంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకగా ముందుకు సాగిపోయింది.

అయితే.. ఇప్పుడు రెండున్నరేళ్లు అయినప్పటికీ.. తమను పట్టించుకోవడం లేదనేది.. కమ్మ వర్గం గుసగుస. ఇటీవల కొందరు కమ్మ వర్గానికి చెందిన నాయకులు బాహాటంగానే ఈ మాట అనేశారు. మా నాయకులు ఉన్నా..మాకు ప్రయోజనం ఏముందని వ్యాఖ్యానించారు. దీంతో హుటాహుటిన కమ్మ వర్గం నేతలతో వసంత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు.. జీఎస్టీని తగ్గించాలని.. కొన్ని వర్గాలకు మాత్రమే ప్రభుత్వం మేలు చేస్తోందని.. తమకు ఏమీ చేయడం లేదని.. ప్రభుత్వంతో చర్చించి.. సమస్యలు పరిష్కరించాలని.. కోరారు. దీనిపై వారికి మళ్లీ వసంత హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటికీ ఆయా సమస్యలు పరిష్కారం కాలేదు.

దీంతో కమ్మ వర్గం ఇప్పుడు.. మళ్లీ వసంతపై విరుచుకుపడుతోంది. దీనిని గమనించిన దేవినేని.. మళ్లీ కమ్మ వర్గాన్ని చేరదీస్తున్నారు. అయితే.. ఇప్పుడు అటు వసంతను, ఇటు దేవినేనిని కూడా నమ్మే పరిస్తితి లేకుండా పోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని జోక్యం చేసుకున్నారని.. త్వరలోనే కమ్మ వర్గానికి న్యాయం చేసేలా సీఎంతో చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. మొత్తంగా చూస్తే.. కమ్మ వర్గం వసంత కు దూరమైతే.. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు ఈజీ కాదని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post