ఈ సారి ఎన్నికల్లో తాను పోటీ చేయనని తన వారసుడుని పోటీకి దింపుతానని ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని పలుమార్లు క్లారిటీ ఇస్తూ వచ్చిన విషయం తెలిసిందే. జగన్ నిర్వహించిన వైసీపీ వర్క్ షాపులో కూడా అదే విషయం చెప్పారు. కానీ జగన్ మాత్రం వారసులకు సీటు ఇవ్వనని చెప్పారు. అయినా సరే మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని వారసుడు కృష్ణమూర్తి(కిట్టు)నే తిరుగుతున్నారు.

పేర్ని బదులు బందరు మొత్తం కిట్టు తిరుగుతున్నారు. గడపగడపకు వెళుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేగా మాదిరిగా అధికారం చెలాయిస్తున్నారు. ఇక ఈ సీన్ చూస్తుంటే నెక్స్ట్ ఎన్నికల్లో కిట్టు వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు ఫిక్స్ అయిపోయాయి. ప్రత్యర్ధి పార్టీ వాళ్ళు కూడా కిట్టునే బరిలో దిగుతారని మాట్లాడుకుంటున్నారు. అయితే పేర్ని వారసుడు పోటీ చేస్తే..టీడీపీ నుంచి పోటీ చేసే కొల్లు రవీంద్రకు గెలుపు సులువు అని చర్చ నడుస్తోంది.

కిట్టు అభ్యర్ధి అయితే కొల్లుకు డౌట్ లేదని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కిట్టుకు ఎలాంటి అధికారాలు లేకపోయినా సరే..ఈ మూడున్నర ఏళ్ళు తండ్రి అధికారాలని అడ్డం పెట్టుకుని బాగానే పెత్తనం చెలాయించారు. ఓ షాడో ఎమ్మెల్యే మాదిరిగా బందరులో తిరుగుతున్నారు. క్యాడర్ వరకు ఆయన నాయకత్వం ఓకే గాని..అధికార విషయాల్లో కూడా కిట్టు తలదూర్చారు అనే విమర్శలు ఉన్నాయి.

అలాగే సొంత పార్టీలో కూడా కిట్టు ఒంటెద్దు పోకడలపై అసంతృప్తి సెగలు వస్తున్నాయి. అటు ఎంపీ బాలశౌరికి సపోర్ట్ చేసే వైసీపీ కార్యకర్తలని కిట్టు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎంపీని కలవద్దని వార్నింగ్లు కూడా ఇస్తున్నారని తెలిసింది. ఈ పరిణామాలు పేర్నికి బాగా మైనస్ అవుతున్నాయి. ఏదేమైనా గాని నెక్స్ట్ కిట్టు బరిలో దిగితే వైసీపీ గెలుపు డౌటే అంటున్నారు.
