ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో పెద్ద చర్చే నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కించపరుస్తూ వైసీపీ నేతలు మాట్లాడిన మాటలని నందమూరి ఫ్యామిలీ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ…ఆడవాళ్ళని గౌరవించాలని, ఇలాంటి మాటలు అరాచక పాలనకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. కాకపోతే ఎన్టీఆర్ డైరక్ట్‌గా ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. చాలా డిప్లమాటిక్‌గా స్పందించారు.

దీనిపై టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి. ఎన్టీఆర్ ఇంకా బాగా స్పందించవచ్చని, వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చే స్థాయిలో మాట్లాడలేదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత వర్ల రామయ్య…ఎన్టీఆర్ గురించి కామెంట్ చేశారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్ విఫలమయ్యారని, మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని, సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా? అని ప్రశ్నించిన వర్ల..అదే హరికృష్ణ ఉంటే పరిస్తితి వేరేగా ఉండేదని మాట్లాడారు.

కొడాలి, వంశీ లాంటి వారిని కంట్రోల్ చేసే శక్తి ఎన్టీఆర్‌కే ఉందని చెప్పారు. అయితే వర్ల, ఇతర టీడీపీ నేతలు ఎన్టీఆర్‌ని ఉద్దేశించిన మాటలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలు సైతం వర్ల తీరుపై ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్..రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని, అయినా సరే ఆయన చెప్పాల్సింది చెప్పారని, అలాంటప్పుడు ఆయన్ని పట్టుకుని అనడం కరెక్ట్ కాదని అంటున్నారు.

అసలే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త టీడీపీకి దూరంగా ఉంటున్నారని, ఇలాంటి సమయంలో వర్ల లాంటి నేతల మాటల వల్ల…వారు ఇంకా పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని, అయినా ఎన్టీఆర్‌ని అనడం వల్ల పార్టీకే డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు. ఒకవైపు పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు కష్టపడుతుంటే..మరోవైపు ఇలాంటి నాయకులు అనవసరమైన విషయాలు మాట్లాడి పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారని సొంత కార్యకర్తలే ఫైర్ అవుతున్నారు.

Discussion about this post