కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య ఇప్పుడు ఒక యంగ్ లీడర్ పేరు తరచూ చర్చకు వస్తోంది. ఆయన దూకుడు, మాట తీరు.. నేతలతో కలిసిపోతున్న విధానం వంటివి చర్చకు వస్తున్నాయి. ఆయనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత వర్ల రామయ్య కుమారుడు.. కుమార్ రాజా వర్ల. ఇటీవల ఆయనను పామర్రు నియో జకవర్గం పార్టీ ఇంచార్జ్‌గా నియమించారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఆయన పోటీ చేయడం దాదాపు ఖరారైంది. అయితే.. వర్ల రామయ్యకు, ఆయన తనయుడికి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోందని అంటు న్నారు నాయకులు చర్చించుకుంటున్నారు.

రామయ్యను తీసుకుంటే.. ఆయనకు దూకుడు ఎక్కువ. విమర్శలు కూడా అలవోకగా చేస్తారు. ఒక్కోసారి సబ్జెక్ట్ కంటే వాయిస్‌తో డామినేషన్ చేసేందుకు ప్రయత్నిస్తారన్న టాక్ కూడా ఉంది. ఆయన మీడియాలో ఎంత గట్టిగా మాట్లాడినా సామాన్య ప్రజలకు ఎందుకో గాని కనెక్ట్ కాలేకపోయారు. దీంతో ఆయన ప్రజల్లో నిలదొక్కుకోలేక పోయారనే వాదన ఉంది. ఇప్పటికి రెండు మూడు సార్లు ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ఆశించిన విధంగా ఫలితం దక్కించుకోలేక పోయారు. అయితే.. దీనికి భిన్నంగా కుమార్ రాజా మాత్రం ఆలోచనాపరుడిగా.. ఏ విషయంపైనైనా.. ఆచితూచి మాట్లాడే నాయకుడిగా వ్యవహ రిస్తున్నారని.. నాయకులు చెప్పుకొంటున్నారు. ఉన్నత విద్యా వంతుడు కావడం.. పార్టీ కార్యక్రమాలు.. విధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవడం వంటివి రాజాకు కలిసి వస్తున్నాయని అంటున్నారు.

ఇటీవల.. పార్టీ అధినేత చంద్రబాబు కూడా కీలక పనులను రాజాకు అప్పగిస్తున్నారు. దీంతో చంద్రబాబు కనుసన్నల్లో రాజా ఆయా పనులను పూర్తి చేస్తున్నారని వివాద రహితుడిగా.. ప్రతిఒక్కరినీ కలుపుకొని పోయే నాయకుడిగా కూడా ఆయన గుర్తింపు పొందారని నాయకులు చర్చించుకోవడం గమనార్హం. అంతే కాదు.. పామర్రు నియోజకవర్గంపైనా.. ఆయన దృష్టి పెట్టారు. తరచుగా ఇక్కడ పర్యటిస్తున్నారు. స్థానిక యువతను కలుసుకుంటున్నారు. వారి యాస్పిరేషన్స్ తెలుసుకుంటున్నారు. స్థానికంగా ఉన్న యువత ను తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. అదే సమయంలో స్థానిక సమస్యలపైనా దృష్టి పెడుతున్నారు.ఇటీవల గుంటూరు జిల్లా శావల్యాపురం జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన సూటిగా, స్పష్టంగా చేసిన ప్రసంగాలకు అక్కడ జిల్లా నేతలు కూడా ఫిదా అయ్యారు. పామర్రు టీడీపీలో ఇక్కడ ఏ నేత పోటీలో ఉన్నా గ్రూపుల గోల ఉండేది. కుమార్ రాజా వచ్చాక యువకుడు కావడంతో ప్రతి ఒక్కరు ఆయన కింద పనిచేసే విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. అంతే కాకుండా ఆయన అందరికి కలుపుకుని వెళుతోన్న తీరు జిల్లాలో ఆసక్తికరంగా మారింది.

దీంతో కుమార్ రాజా పేరు సీనియర్ నేతల మధ్య కూడా చర్చకు వస్తుండడం గమనార్హం. ఇన్నాళ్లకు పామర్రులో టీడీపీకి నమ్మకమైన నాయకుడు దొరికాడంటూ.. సీనియర్లు భావిస్తున్నారు. గతంలో వర్ల రామయ్య ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత.. ఉప్పులేటి కల్పన వచ్చారు. ఆమెను చంద్రబాబు నమ్మారు. కానీ, వైసీపీలోకి వెళ్లారు. తర్వాత వచ్చారు. అయినా.. స్థిరత్వం లేని రాజకీయాలు చేస్తున్నారు. దీంతో నమ్మకమైన నాయకుడు టీడీపీకి పామర్రులో లేకుండా పోయారు. ఈ క్రమంలో కుమార్ రాజా వర్ల.. టీడీపీకి ఇక్కడ ఐకాన్‌గా ఉన్నారని నాయకులు భావిస్తుండడం గమనార్హం.
Discussion about this post