గత ఎన్నికల్లో విశాఖ సిటీలో టీడీపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. సిటీలోని నాలుగు స్థానాలని టిడిపి కైవసం చేసుకుంది. విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లు టిడిపి ఖాతాలో పడ్డాయి. దీంతో అక్కడ తమ బలం పెంచుకోవాలని వైసీపీ గట్టిగా ప్రయత్నించింది. ఇదే క్రమంలో రాజధాని కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చింది. అలాగే సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ని వైసీపీలోకి తీసుకున్నారు. అయినా సరే వైసీపీ బలం పెద్దగా పెరగలేదు.

పైగా వైసీపీలోకి వెళ్ళిన వాసుపల్లికి కష్టాలు మొదలయ్యాయి. అక్కడ వైసీపీ కార్యకర్తలు వాసుపల్లికి పూర్తిగా సహకరించడం లేదు. ఆయన్ని వైసీపీ ఇంచార్జ్‌గా నియమించిన పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆయనకు సొంత పోరు ఎక్కువైంది. అక్కడే ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్..విశాఖ సౌత్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. సీటు వాసుపల్లికే అని ప్రకటించిన వెనక్కి తగ్గట్లేదు. పైగా ఆయనని ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించారు. అయినా సీతంరాజు తనదైన శైలిలో ముందుకెళుతున్నారు.

ఇదే సమయంలో విజయసాయి రెడ్డి విశాఖ సౌత్‌లో రాజకీయం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పెత్తనం వల్ల అక్కడ రచ్చ మొదలైందని తెలిసింది. పైగా సీతంరాజుకు సాయిరెడ్డి సపోర్ట్ ఉందని తెలుస్తోంది. దీంతో వాసుపల్లి తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్లు సమాచారం. ఇక ఈ రచ్చ వల్ల విశాఖ సౌత్ లో వైసీపీకి పెద్ద డ్యామేజ్ జరిగేలా ఉంది. ఇప్పటికే అక్కడ వైసీపీకి పెద్ద బలం లేదు. అదే సమయంలో టీడీపీతో జనసేన జతకడితే సౌత్ మాత్రమే కాదు..సిటీలో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కడం కష్టమే అని అంటున్నారు.

Leave feedback about this