వెల్లంపల్లి శ్రీనివాస్..ఈయన దేవాదాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు ఎక్కువ విమర్శలు ఎదురుకున్నారు. అసలు ఇంత ఎక్కువగా విమర్శలు ఎదురుకున్న మంత్రి ఎవరు లేరనే చెప్పాలి. దేవాదాయ శాఖలో అవినీతి…దేవాలయలపై దాడులు ఇలా ప్రతి అంశం వెల్లంపల్లికి నెగిటివ్ అయింది..ఇక పని కట్టుకుని పవన్ కల్యాణ్ ని తిట్టడం వల్ల సొంత నియోజకవర్గం విజయవాడ వెస్ట్ లో తనకు గతంలో ఓట్లు వేసిన కాపు ఓటర్లని దూరం చేసుకున్నారు.

దేవాదాయ శాఖలో అవినీతి ఆరోపణలతో ఇంకా నెగిటివ్ తెచ్చుకున్నారు. ఇక ఎలాంటి వివాదాలు లేని టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు లాంటి వారిని బూతులు తిట్టి..ఇంకా దారుణంగా తన గ్రాఫ్ పడిపోయేలా చేసుకున్నారు. చివరికి మంత్రి పదవి పోయింది. ఇలా అడుగడుగున వ్యతిరేకతని తెచ్చుకున్నారు. సొంత స్థానంలో చేసే అభివృద్ధి తక్కువ వివాదాలు ఎక్కువ. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీలో టిడిపి సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్యపై దాడి చేసి..దారుణమైన విమర్శలు ఎదురుకుంటున్నారు. స్పీకర్ పోడియం కింద నిరసన తెలుపుతున్న బుచ్చయ్య వద్ద ప్లకార్డు లాక్కుని ఆయన్ని నెట్టేశారు.
ఇలా చేయడంతో వెల్లంపల్లిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు మంచి పనులు చేసేది లేదు గాని..ఇలాంటి పనుల్లో మాత్రం ముందు ఉంటున్నారని, ప్రతిపక్ష నేతలని బూతులు తిట్టడం, ఇలా దాడులు చేయడం వల్ల వెల్లంపల్లిని విజయవాడ వెస్ట్ ప్రజలు ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు.
ఇప్పటికే సర్వేల్లో వెస్ట్ లో వెల్లంపల్లి గెలిచే అవకాశం లేదని తేలింది. కాకపోతే టిడిపి-జనసేన సెపరేట్ గా పోటీ చేస్తే కాస్త ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది గాని..రెండు పార్టీలు పొత్తులో వస్తే వెస్ట్ లో వెల్లంపల్లికి ఇదే లాస్ట్ ఛాన్స్ అని తెలుస్తోంది.