గత ఎన్నికల్లో జగన్ గాలిలో గెలిచిన నేతలంతా ఇప్పుడు ఓటమి దిశగా వెళుతున్నారు. అలా గాలిలో గెలిచి ప్రజా బలం పెంచుకోకుండా..ఇంకా వ్యతిరేకత పెంచుకున్న నేతలు..ఈ సారి గెలవడం కష్టమని తెలుస్తుంది. అలా వేమూరు నియోజకవర్గంలో మంత్రి మేరుగు నాగార్జున ఓటమి దిశగా వెళుతున్నారనే చెప్పాలి. మామూలుగా వేమూరులో టిడిపికి బలం ఎక్కువ. 1983, 1985, 1994, 1999, 2009, 2014 ఎన్నికల్లో అక్కడ టిడిపి గెలిచింది.
ఇక నాగార్జున 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయి..చివరికి 2019 ఎన్నికల్లో గెలిచారు. అది కూడా జగన్ గాలిలోనే..అలా గెలిచాక సొంతంగా ప్రజా బలం పెంచుకోవడంలో విఫలమవుతున్నారు. పైగా మంత్రిగా ఉంటూ వేమూరులో అభివృద్ధి చేసింది లేదు. దానికి తోడు అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు ఎక్కువ ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయని టిడిపి ఫైర్ అవుతుంది. దీంతో మంత్రిగా నెగిటివ్ తప్ప పాజిటివ్ లేదు.

ఇటు టిడిపి నుంచి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పికప్ అవుతున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన ఈయన..టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. బాబుకు అండగా నిలబడుతూ వచ్చారు. ఇటు వేమూరులో మళ్ళీ పార్టీని గాడిలో పెట్టారు. దీంతో అక్కడ టిడిపి బలం నిదానంగా పెరుగుతూ వస్తుంది.
ఇక మంత్రి నాగార్జునపై ఉన్న వ్యతిరేకత ఆనందబాబుకు కలిసొస్తుంది. ఈ సారి వేమూరులో నాగార్జున గెలవడం కష్టమని లేటెస్ట్ సర్వేలు కూడా చెబుతున్నాయి. దీంతో ఈ సారి మంత్రికి చెక్ పడటం ఖాయంగా కనిపిస్తుంది. ఇటు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గెలుపు దిశగా వెళుతున్నారు.
