ఏపీలో రాజకీయాలు ఊహించని విధంగా మారుతున్నాయి….ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్తితి ఉంటుందో అర్ధం కాకుండా ఉంది. పైకి అధికార వైసీపీకే బలం ఉన్నట్లు కనిపిస్తున్నా సరే…అనూహ్యంగా టీడీపీ కూడా పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. అధికార బలం వల్ల వైసీపీ హైలైట్ అవుతుంది గానీ…కనిపించకుండా టీడీపీ కూడా పికప్ అవుతుంది. అయితే కొన్ని చోట్ల రివర్స్ పరిస్తితి ఉంది. టీడీపీ సిట్టింగ్ సీట్లలో వైసీపీ పికప్ అవుతుంది.

బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న కొన్ని సీట్లలో పరిస్తితి అలాగే ఉంది. గత ఎన్నికల్లో బాపట్ల పరిధిలో ఉన్న వేమూరు, మాచర్ల, సంతనూతలపాడు స్థానాలని వైసీపీ గెలుచుకోగా, రేపల్లె, చీరాల, అద్దంకి, పర్చూరు స్థానాలని టీడీపీ గెలుచుకుంది. అయితే ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయింది. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ అయిన పరిస్తితి. అద్దంకి, పర్చూరుల్లో రివర్స్ అవ్వలేదు. అక్కడ టీడీపీ స్ట్రాంగ్‌గానే ఉంది. అలాగే మాచర్లలో వైసీపీ స్ట్రాంగ్‌గానే ఉంది.

కానీ మిగిలిన స్థానాల్లో సీన్ రివర్స్ అయింది. వైసీపీ చేతుల్లో ఉన్న వేమూరు, సంతనూతలపాడు, బాపట్ల నియోజకవర్గాల్లో టీడీపీ పట్టు సాధిస్తుంది. ముఖ్యంగా వేమూరులో టీడీపీ చాలా వరకు పికప్ అయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఈ సారి టీడీపీ సత్తా చాటేలా ఉంది. వరుసగా ఓడిపోతూ వస్తున్న బాపట్లలో కూడా ఈ సారి టీడీపీకి మంచి ఛాన్స్ ఉంది.

అటు టీడీపీ చేతుల్లో ఉన్న రేపల్లెలో వైసీపీకి పట్టు దక్కినట్లు కనిపిస్తోంది. ఇంతవరకు రేపల్లెలో వైసీపీ జెండా ఎగరలేదు. కానీ ఈ సారి మాత్రం సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పట్ల ప్రజలు పెద్దగా పాజిటివ్ గా లేరు…పైగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండటం తక్కువే. అందుకే ఈ సారి రేపల్లెలో వైసీపీ హవా నడిచేలా ఉంది.

Discussion about this post