తెలుగుదేశం పార్టీ చేతులారా కొన్ని సీట్లని పోగొట్టుకునేలా ఉంది. టిడిపికి బలం ఉన్న నియోజకవర్గాల్లో సరిగ్గా ఫోకస్ చేయక దెబ్బతినేలా ఉంది. పోనీ రాయలసీమ లాంటి చోట్ల వైసీపీ హవా ఉంటుంది కాబట్టి..అక్కడ ఉన్న సీట్లని పెద్దగా పట్టించుకోకపోయినా పర్లేదు అనుకోవచ్చు. కానీ టిడిపికి పట్టున్న గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్ని సీట్లని లైట్ తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల సరైన ఇంచార్జ్ లని పెట్టడం లేదు.
అలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో టిడిపికి సరైన నాయకుడు లేరు. ఇక్కడ టిడిపికి బాగా పట్టు ఉంది. 2009, 2014 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలిలో ఓడింది. టిడిపి నుంచి పెందుర్తి వెంకటేష్ రెండుసార్లు గెలిచారు..గత ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఓడిన దగ్గర నుంచి ఆయనే ఇంచార్జ్ గా ఉన్నారు. కానీ పార్టీని బలోపేతం చేసే అంశంలో విఫలమయ్యారు. చంద్రబాబు పలుమార్లు క్లాస్ పీకిన మారలేదు.

అసలు కమ్మ నేత గా ఉంటూ…ఆ వర్గాన్ని దూరం చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రాజా..తన సొంత వర్గం కాపులతో పాటు కమ్మ వర్గాన్ని దగ్గర చేసుకున్నారు. అందుకే గత ఎన్నికల్లో గెలిచారు. ఇప్పటికీ ఆయన బలం తగ్గలేదు. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో రాజా మరింత బలపడుతున్నారు. అయితే ఆ మధ్య వెంకటేష్ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేసి తప్పుకున్నారు.
దీంతో రాజానగరంలో టిడిపికి నాయకుడు లేరు. దీంతో రాజాకు తిరుగులేకుండా పోయింది. అయితే వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజానగరం సీటు జనసేనకు దక్కుతుందనే ప్రచారం ఉంది. చూడాలి మరి రాజానగరంలో పరిస్తితి ఎలా ఉంటుందో.