పల్నాడు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ (NTR Statue) ధ్వంసాన్ని టీడీపీ (TDP) అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) తీవ్రంగా ఖండించారు.
పల్నాడు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసాన్ని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. మహనీయులను అవమానించే చర్యలు పరిపాటిగా మారాయని మండిపడ్డారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన బాధ్యులపై చర్యలు చేపట్టాలని ట్విట్టర్‌లో చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసానికి నిరసనగా టీడీపీ నేతలు, కార్యకర్తలు హైవేపై ఆందోళన చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ విగ్రహంపై ఈ అమానుష ఘటన దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

