ఇంతకాలం వైసీపీలో నెంబర్ 2గా ఉంటూ వచ్చిన విజయసాయి రెడ్డి ఇప్పుడు వైసీపీకి దూరమవుతున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే కాస్తా డౌట్ గానే ఉంది. ఈ మధ్య ఆయన వైసీపీ కార్యక్రమాల్లో కనబడటం లేదు. ఎప్పటిలాగా ట్విట్టర్ లో చంద్రబాబు, లోకేష్‌లని తిట్టడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఆయన కాస్త వైసీపీకి దూరం జరిగారా? అనే పరిస్తితి.
మొదట నుంచి ఆయన జగన్ వెనుకే ఉన్నారు..జగన్ తో పాటు ఏ2గా జైలుకు కూడా వెళ్లారు. 2019లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఉత్తరాంధ్ర బాధ్యతలని చూసుకున్నారు. సోషల్ మీడియా బాధ్యతలు కూడా ఆయనకే. కానీ ఇటీవల కాలంలో ఆయనకు వైసీపీలో ప్రాధాన్యత తగ్గుతుందా? అనే పరిస్తితి సోషల్ మీడియా బాధ్యతలని సజల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ కు అప్పగించారు. విజయసాయిరెడ్డిని అక్కడ సైడ్ చేసేశారు. ఇక ఉత్తరాంధ్ర బాధ్యతలని వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. దీంతో ఆయన ఉత్తరాంధ్రలో పెద్దగా కనిపించడం లేదు.

ఇదే సమయంలో ఇటీవల నందమూరి తారకరత్న చనిపోవడం..తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి విజయసాయి పెదనాన్న అవుతారనే సంగతి తెలిసిందే. అటు తారకరత్నకు చంద్రబాబు మావయ్య అవుతారు. అయితే తారకరత్న చనిపోయిన రోజు చంద్రబాబు పక్కనే విజయసాయి కూర్చుని చాలాసేపు మాట్లాడారు. పెదకర్మ రోజు కూడా అదే పరిస్తితి.
అప్పటినుంచి విజయసాయి..చంద్రబాబుపై విమర్శలు చేయడం లేదు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు వేయడానికి కూడా రాలేదు. వైజాగ్‌లో విజయసాయిరెడ్డి తన ఓటును నమోదు చేసుకున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలకు వైసీపీ తరుఫున పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతుగా నిలవాల్సిన విజయసాయిరెడ్డి.. ఢిల్లీకి వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదు. దీని బట్టి చూస్తే విజయసాయి వైసీపీకి దూరం జరుగుతున్నారా? అనే పరిస్తితి.
