గత ఎన్నికల్లో బ్యాడ్ లక్ ఎవరిదంటే డౌట్ లేకుండా బోండా ఉమాది అని చెప్పవచ్చు..అందులో ఎలాంటి డౌట్ లేదు. కేవలం 25 ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ప్రతి రౌండ్ లో ఆధిక్యంలో కొనసాగి..చివరికి గెలుపు కూడా దాదాపు ఫిక్స్ అయిన సమయంలో ప్రత్యర్ధి మల్లాది విష్ణు, అధికారులు కలిసి ఫలితం తారుమారు చేసి చివరికి 25 ఓట్ల తేడాతో తనని ఓడించారని బోండా ఇప్పటికీ ఆరోపణలు చేస్తారు.
సరే ఎలా వచ్చిన గాని బోండాకు ఓటమి వచ్చింది. అలా 25 ఓట్ల తేడాతో ఓడిపోయిన బోండా..అప్పటినుంచి కసితో పణిచేస్తూ వస్తున్నారు. మళ్ళీ గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. మరి బోండాకు విజయవాడ సెంట్రల్ లో గెలుపు ఛాన్స్ ఉందా? అక్కడ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది పరిస్తితి ఎలా ఉందనేది ఒక్కసారి చూస్తే..సెంట్రల్ లో ఎమ్మెల్యే మల్లాదికి మాత్రం పెద్ద పాజిటివ్ మాత్రం లేదని తెలుస్తుంది. అలాగే ఈ నాలుగేళ్లలో అభివృద్ధి కూడా పెద్దగా జరగలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక సొంత పార్టీలోనే ఆయనకు విభేదాలు ఉన్నాయి.

ఈ పరిణామాలు మల్లాదికి మైనస్..అటు బోండా దూకుడుగా పనిచేస్తున్నారు. పార్టీలో మొదట నుంచి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. తన బలాన్ని పెంచుకుంటూనే పార్టీ కోసం పోరాడుతున్నారు. దీంతో సెంట్రల్ లో బోండాకు ఆధిక్యం కనిపిస్తుంది. అదే సమయంలో టిడిపి-జనసేన పొత్తు ఖాయమవుతుంది. పొత్తు ఉంటే డౌట్ లేకుండా బోండా గెలవడం ఖాయం.
2014 ఎన్నికల్లో జనసేన సపోర్ట్ చేయడం వల్ల మంచి మెజారిటీతో గెలిచారు. 2019లో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి నష్టం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కలిసిపోటీ చేయడంతో సెంట్రల్ లో బోండా మెజారిటీపైనే చర్చ నడుస్తుంది.