March 22, 2023
విజయవాడ ఎంపీ సీటు ఎవరికి?
ap news latest AP Politics TDP latest News YCP latest news

విజయవాడ ఎంపీ సీటు ఎవరికి?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు టి‌డి‌పి సీట్లు ఫిక్స్ అయిపోయాయనే చెప్పవచ్చు. జనసేన పొత్తు బట్టి రెండు, మూడు సీట్లలో మార్పు ఉండవచ్చు గాని..దాదాపు ఇంచార్జ్ లుగా ఉన్నవారే తమ స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంది. అయితే విజయవాడ ఎంపీ సీటులో కాస్త క్లారిటీ మిస్ అవుతుంది. ప్రస్తుతానికి అక్కడ ఎంపీ కేశినేని నాని ఉన్నారు..మళ్ళీ ఆయనకే సీటు ఇస్తారా? లేక ఆయన సోదరుడు కేశినేని చిన్నికి సీటు ఇస్తారా? అనేది తెలియడం లేదు.

నాని చాలా రోజుల నుంచి సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు అధిష్టానంపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. అంటే పార్టీ కోసమే తాను అలా అంటున్నానని కేశినేని చెబుతున్నారు. ఇక కేశినేనికి చెక్ పెట్టేందుకు విజయవాడలోని కొందరు టి‌డి‌పి నేతలు పనిచేస్తున్నారు. దాదాపు ఆయన్ని పార్టీ నుంచి సైడ్ చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటు కేశినేని సైతం టి‌డి‌పిలో అంతగా యాక్టివ్ గా ఉండటం లేదు..తన పనులు తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇండిపెండెంట్ గా పనిచేసుకుంటూ వెళుతున్నారు. సోషల్ మీడియా లో కూడా టి‌డి‌పి ఊసు గాని, చంద్రబాబు బొమ్మ గాని ఉంచలేదు. దీని బట్టి చూస్తే కేశినేని టి‌డి‌పికి దూరమవుతున్నారా? అనే డౌట్ వస్తుంది. ఇదే సమయంలో కేశినేని సోదరుడు చిన్ని విజయవాడ పార్లమెంట్ పరిధిలో పనిచేస్తున్నారు. టి‌డి‌పి నేతలని సమన్వయం చేసుకుని ముందుకెళుతున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

దీంతో విజయవాడ ఎంపీ సీటు కేశినేని చిన్నికే అని ప్రచారం మొదలైంది. అయితే కేశినేని నాని ఇమేజ్ వేరు..చిన్ని ఇమేజ్ వేరు. నానికి పార్లమెంట్ పరిధిలో ఫాలోయింగ్ ఎక్కువ. కాబట్టి నానిని కాదని చిన్నికి సీటు ఇస్తారా? అనేది చూడాలి. మరి నాని ఎలా ముందుకెళ్తారో చూడాలి.