May 31, 2023
ap news latest AP Politics TDP latest News

విజయం కోసం టీడీపీ ‘వియ్యంకుల’ పోరాటం..గట్టెక్కేది ఎవరో?

రాజకీయ పరంగా శతృత్వం మాత్రమే కాదు..బంధుత్వం కూడా ఉంటుందనే చెప్పాలి. రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చాక బంధుత్వాలు కలుపుకున్న వారు ఉన్నారు. అలా బంధుత్వాలు కలుపుకున్న వియ్యంకులు టి‌డి‌పిలో కొందరు ఉన్నారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు-నారాయణ వియ్యంకులు అని అందరికీ తెలిసిందే. ఇటు మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు-కొమ్మాలపాటి శ్రీధర్ వియ్యంకులే. ఇక మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా- సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వియ్యంకులే.

ఇప్పుడు ఈ వియ్యంకులు రాజకీయంగా విజయం అందుకోవడం కోసం చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఒక్క గంటా మాత్రమే విజయం సాధించారు. మిగిలిన వారు ఓటమి పాలయ్యారు. కానీ ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ సారి గంటా ఏ సీటులో పోటీ చేస్తారో క్లారిటీ లేదు..కానీ గెలిచి మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. అటు మాజీ మంత్రి నారాయణ గత ఎన్నికల్లో ఓడిన నెల్లూరు సిటీలో పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు. అక్కడ ఆయనకు గెలుపు అవకాశాలు ఉన్నాయి.

ఇటు వినుకొండలో ఖచ్చితంగా గెలవాలని జీవీ పనిచేస్తున్నారు. ఇక్కడ జీవీకి గెలుపుకు ఛాన్స్ ఉంది. అటు పెదకూరపాడులో కొమ్మాలపాటి కాస్త కష్టపడాలి. కష్టపడితే గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇక బోండా ఉమా విజయవాడ సెంట్రల్ లో గెలవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ బోండాకు ఆధిక్యం ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది.

అయితే ఏవీ గత ఎన్నికల్లో పోటీ చేయలేదు..ఈ ఎన్నికల్లో సీటు దక్కుతుందనే గ్యారెంటీ లేదు. ఏదేమైనా ఈ వియ్యంకులు ఈ సారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ సారి అందరూ గట్టెక్కేలా ఉన్నారు.