ఓ వైపు అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని…అమరావతి రైతులు, ప్రజలు దాదాపు రెండేళ్ల నుంచి ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే అమరావతి రాజధాని కోసం….న్యాయస్థానం టూ దేవస్థానం అని మహా పాదయాత్ర చేస్తున్నారు. అమరావతిలోని హైకోర్టు నుంచి తిరుపతి వెంకన్న ఆలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇలా అమరావతి కోసం పోరాడుతుంటే…మరోవైపు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఇండియన్ నేవీ గుర్తించింది… రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా గుర్తించిన తర్వాత యుద్ధ నౌకకు విశాఖపట్నం పేరుతో నామకరణం చేశామని నేవీ అధికారులు చెప్పారు.

అలాగే డిసెంబర్ 4న విశాఖలో జరిగే నేవీ వేడుకలకు రావాలని సీఎం జగన్‌ని ఆహ్వానించారు. అయితే మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉండగా ఇండియన్ నేవీ.. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఎలా గుర్తించిందని ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే అంశంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు…కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌కు ఫిర్యాదు చేశారు. యుద్ధనౌకకు విశాఖపట్నం అనే పేరు పెట్టడంలో ఇబ్బంది లేదని, కానీ ఏపీ రాజధానిగా అమరావతి ఉండగా, యుద్ధనౌకకు ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరు పెట్టామని ప్రకటించడం కోరు ధిక్కరణ కిందకు వస్తుందని రఘురామ, రాజ్‌నాథ్‌కు రాసిన లేఖలో వివరించారు.

అయితే నేవీ అధికారులకు రాజధాని అంశంపై క్లారిటీ లేదని, కానీ నేవీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్యలో కొ-ఆర్డినేటర్‌గా ఉన్న కమాండర్ సుజిత్ రెడ్డి ప్రమేయంతోనే ఇది జరిగిందని రఘురామ ఆరోపిస్తున్నారు. కొందరు వ్యక్తిగత ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సుజిత్ రెడ్డిపై విచారణ జరపాలని రఘురామ, రాజ్‌నాథ్‌ని కోరారు.

అంటే ఇండియన్ నేవీ విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా గుర్తించడం వెనుక ఎంత పెద్ద కథ జరిగిందో అర్ధమవుతుందనే చెప్పాలి. మరి ఈ అంశంపై కోర్టు ఎలా స్పందిస్తుంది..అలాగే రాజ్‌నాథ్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎలాగైనా ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే పదం తీయించేలా చేస్తానని రఘురామ చెబుతున్నారు.

Discussion about this post