ఏపీలో సైకిల్ జోరు మొదలైంది..అనూహ్యంగా టిడిపి బలపడుతుంది..వైసీపీకి ఎదురుగాలి వీయడం మొదలైంది. జగన్ పాలనపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. పైకి అంతా మంచి చేస్తున్నట్లు జగన్ ప్రచారం చేసుకుంటున్నారు..కానీ క్షేత్ర స్థాయిలో పరిస్తితులు వేరుగా ఉన్నాయి. పథకాల పేరుతో రూపాయి ఇచ్చి..పన్నుల రూపంలో వంద రూపాయిలు తీసుకుంటున్నారనే భావన ప్రజల్లో ఉంది. పైగా అభివృద్ధి శూన్యం. వైసీపీ ఎమ్మెల్యేల దోపిడి పెరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయం సృష్టించే మార్గాలు లేవు.
ఇలాంటి క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు దూకుడుగా ముందుకెళుతున్నారు. ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నారు. ప్రజలకు అండగా ఉంటున్నారు. అటు నారా లోకేష్ ప్రజల్లోనే పాదయాత్ర చేస్తున్నారు. అలాగే ప్రజల కోసం కీలక హామీలు ఇస్తున్నారు. దీంతో టిడిపి హవా మరింత పెరుగుతుంది. అయితే జగన్ ప్రభుత్వం వల్ల మరింత నష్టపోయిన నగరాలు..ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. జగన్ వైపు నుంచి టిడిపి వైపుకు వస్తున్నాయి. అసలు గత ఎన్నికల్లోనే నగరాల్లో వైసీపీకి పోటీగా టిడిపి సీట్లు గెలిచింది.

ఈ సారి మాత్రం క్లీన్ స్వీప్ చేసేలా ఉంది. విశాఖ నుంచి గుంటూరు వరకు ఉన్న నగరాల్లో టిడిపి సత్తా చాటేలా ఉంది. ఇక టిడిపికి-జనసేన జత కలిస్తే స్వీప్ ఖాయం. విశాఖ నగరంలో నాలుగు సీట్లు ఉంటే గత ఎన్నికల్లో టిడిపి నాలుగు సీట్లు గెలుచుకుంది. ఈ సారి కూడా గెలుచుకునేలా ఉంది. ఎలాగో జనసేన పొత్తు ఉంటుంది కాబట్టి..డౌట్ లేకుండా నాలుగు కైవసం చేసుకొనున్నాయి. ఇటు కాకినాడ సిటీ, రాజమండ్రి సిటీ సీట్లలో టిడిపికి తిరుగులేదని పరిస్తితి. జనసేన కలిస్తే కాకినాడ సిటీని సులువుగా కైవసం చేసుకోవచ్చు. ఏలూరు సిటీలో కూడా అదే పరిస్తితి.
ఇటు విజయవాడలో మూడు సీట్లు ఉన్నాయి..విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్..టిడిపి-జనసేన కలిస్తే స్వీపే. అటు గుంటూరులో ఈస్ట్, వెస్ట్ సీట్లు ఉన్నాయి. అక్కడ కూడా రెండు పార్టీలు కలిస్తే స్వీప్..మొత్తం మీద సిటీల్లో టిడిపి-జనసేన స్వీప్ ఖాయమే.