March 28, 2023
విశాఖలో వైసీపీకి భారీ షాక్..ఐదు కూడా డౌటే?
ap news latest AP Politics

విశాఖలో వైసీపీకి భారీ షాక్..ఐదు కూడా డౌటే?

మూడు రాజధానుల పేరుతో అందులో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో విశాఖలో వైసీపీ రాజకీయం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అక్కడ రాజకీయంగా టీడీపీని దెబ్బకొట్టడంతో పాటు పూర్తిగా జిల్లాపై పట్టు సాధించాలని వైసీపీ చూస్తుంది. కానీ వైసీపీ చేస్తున్న రాజకీయానికి విశాఖ ప్రజలు రివర్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అనుకున్నంతగా వైసీపీ స్కెచ్ విశాఖలో వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో వైసీపీ బలం తగ్గుతూ వస్తుందని చెప్పాలి.

గత ఎన్నికల్లో జిల్లాలో 15 సీట్లు ఉంటే వైసీపీ 11, టీడీపీ 4 సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో వైసీపీ బలం నిదానంగా తగ్గుతూ వస్తుంది. పస్తుతం జిల్లాలో టీడీపీకి 7 సీట్లలో ఎడ్జ్ ఉంటే..వైసీపీకి 5-6 సీట్లలో ఎడ్జ్ ఉన్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో జనసేన 2 సీట్లలో బలంగా ఉండి. అయితే టీడీపీ-జనసేన పొత్తు ఖాయమవుతున్న నేపథ్యంలో విశాఖలో వైసీపీ ఈ సారి 5 సీట్లు కూడా గెలుచుకోవడమే కష్టమే అనే టాక్.

రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే..విశాఖ సిటీలో ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ లతో పాటు భీమిలి, గాజువాక, నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లి, పాయకరావుపేట, ఎలమంచిలి, పెందుర్తి సీట్లని గెలుచుకోవడం ఖాయమని అంటున్నారు. అరకు, పాడేరు, మాడుగుల సీట్లలోనే వైసీపీకి అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా గాని ఈ సారి విశాఖలో వైసీపీకి భారీ దెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video