ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్నట్లుగా..విశాఖ రాజధాని అని చెబితే..ఉత్తరాంధ్ర ప్రజలు వన్ సైడ్ గా తమకే మద్ధతు ఇచ్చేస్తారని జగన్ అనుకున్నారు..కానీ అవేమీ వర్కౌట్ అవ్వకపోగా, మొత్తం రివర్స్ అవుతుంది. విశాఖ రాజధాని అని చెప్పేది..ఉత్తరాంధ్రపై ప్రేమతో కాదు అని, అక్కడ భూములు, కొండలపై ప్రేమ అని అనుకునే పరిస్తితి. దీని వల్ల అక్కడి ప్రజలు వైసీపీని ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు.
అధికారంలోకి రాగానే ఉన్న అమరావతి రాజధానిని దెబ్బతీస్తూ..మూడు రాజధానుల నినాదం అందుకున్నారు. అమరావతిని శాసన రాజధానిగా ఉంచేసి..కర్నూలుని న్యాయ రాజధానిగా, విశాఖని పరిపాలన రాజధాని చేయాలని డిసైడ్ అయ్యారు. పేరుకు మూడు రాజధానులు గాని..అసలు రాజధాని విశాఖ అన్నట్లు వైసీపీ ప్రచారం చేసింది. దీని వల్ల ఇటు అమరావతిలో..అటు రాయలసీమలో వైసీపీకి ఒరిగింది ఏమి లేదు. పోనీ విశాఖ రాజధాని అంటున్నారు కదా..ఉత్తరాంధ్రలో ఒరిగింది ఏమైనా ఉందా? అంటే అక్కడ అసలు లేదు.

మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటేసింది. కానీ ఇంతవరకు దిక్కు మొక్కు లేదు..అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. అయితే రాజకీయంగా ఏమైనా ఇబ్బందులు వస్తే డైవర్ట్ చేయడానికి..అదిగో త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలుపెడతామని చెబుతూ వస్తున్నారు.
తాజాగా వైఎస్ వివేకా కేసులో సిబిఐ దూకుడుగా ఉంది..ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతామని జగన్ చెప్పుకొచ్చారు. అంటే వివేకా కేసు డైవర్ట్ చేయడానికి రాజధాని తెరపైకి తెచ్చారు. కానీ ఆయన మాటలు ప్రజలు నమ్మే పరిస్తితి కనిపించడం లేదు. ఆఖరికి రాజధాని వస్తున్న విశాఖ ప్రజలు కూడా నమ్మడం లేదు. అసలు వారు రాజధాని కాదు..అభివృద్ధి, కొత్త సంస్థలు రావడం కోరుకుంటున్నారు. జగన్ అవేమీ చేయడం లేదు. కాబట్టి విశాఖలో ఎన్ని ఎత్తులు వేసిన ఉపయోగం లేదు.