మొదట నుంచి విశాఖపట్నం టీడీపీకి అనుకూలమైన ప్రాంతం అని చెప్పొచ్చు…ఇక్కడ టీడీపీ మంచి విజయాలే సాధిస్తూ వస్తుంది. ముఖ్యంగా విశాఖ పార్లమెంట్ పరిధిలో టీడీపీ అద్భుతమైన విజయాలు అందుకుంటూ వచ్చింది. గత ఎన్నికల్లో కూడా విశాఖలో నాలుగు సీట్లు గెలుచుకుంది. అంటే విశాఖలో టీడీపీ బలం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక…విశాఖలో టీడీపీ బలం తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చింది..ఈ క్రమంలోనే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ని వైసీపీలోకి లాగింది. అటు విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు…అసలు టీడీపీకి దూరం జరిగారు..నియోజకవర్గంలో సరిగ్గా పనిచేయడం లేదు. అలాగే వైసీపీ అధికార బలంతో ఇబ్బందులు గురిచేస్తుందనే ఉద్దేశంతో విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు…ఇండిపెండెంట్ గా ముందుకెళుతున్నారు. ఇక విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మాత్రమే ఎన్ని ఇబ్బందులు ఎదురైన పార్టీ కోసం నిలబడి పనిచేస్తున్నారు.



అయితే ఈవిధంగా టీడీపీ బలాన్ని తగ్గించి వైసీపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేసింది…పైగా విశాఖని రాజధాని పేరిట రాజకీయం చేశారు. దీని వల్ల వైసీపీకే అడ్వాంటేజ్ వచ్చినట్లు కనిపించింది. కానీ మూడేళ్లు దాటిన రాజధాని ఊసు లేదు…అభివృద్ధి లేదు…ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదు. దీంతో అనూహ్యంగా వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది.

దీంతో విశాఖ జిల్లాలో మళ్ళీ టీడీపీ పికప్ అయినట్లే కనిపిస్తోంది…మళ్ళీ ఇక్కడ సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ జనసేన గాని టీడీపీతో కలిస్తే వైసీపీ ఒక్క చోట కూడా గెలిచే అవకాశం తక్కువ. అదే టీడీపీ-జనసేన విడిగా పోటీ చేస్తే వైసీపీకి ప్లస్. అలా కాకుండా రెండు కలిస్తే మాత్రం విశాఖలో క్లీన్ స్వీప్ చేయొచ్చు. విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, భీమిలి, గాజువాక, శృంగవరపుకోట సీట్లని టీడీపీ-జనసేన కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

Discussion about this post