తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లో విశాఖ నగరం కూడా ఒకటి. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టిడిపి సత్తా చాటుతుంది. ఇక గత ఎన్నికల్లో విశాఖ మొత్తం వైసీపీ గాలి వీచిన నగరంలో మాత్రం టిడిపి హవా నడిచింది. నగరంలో ఉన్న నాలుగు సీట్లు టిడిపి గెలుచుకుంది. విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లు గెలిచింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక నగరంపై పట్టు సాధించే దిశగా పావులు కదిపింది.
ఈ క్రమంలోనే సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ని వైసీపీలోకి తీసుకున్నారు. అటు నార్త్ లో గెలిచిన గంటా శ్రీనివాసరావు చాలా రోజులు యాక్టివ్ గా పనిచేయలేదు. ఇప్పుడు యాక్టివ్ గా పనిచేస్తున్నారు గాని..నార్త్ లో టిడిపి కాస్త వెనుకబడి ఉంది. అటు సౌత్ లో కూడా అదే పరిస్తితి ఉంది. ప్రస్తుతానికి ఈస్ట్, వెస్ట్ లో మాత్రమే టిడిపి బలంగా కనబడుతుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వెలగపూడి రామకృష్ణ, గణబాబు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే నార్త్ నుంచి మళ్ళీ గంటా పోటీ చేయడం కష్టమని తెలుస్తోంది. ఆయన సీటు మార్చుకోవచ్చు. అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే నార్త్ సీటు ఆ పార్టీకే ఇస్తారనే ప్రచారం ఉంది. ఒకవేళ పొత్తు ఉంటే అక్కడ వైసీపీకి చెక్ పెట్టవచ్చు. లేదంటే వైసీపీదే గెలుపు. సౌత్ లో టిడిపి ఇంచార్జ్ గండి బాబ్జీ ఉన్నారు..ఆయనకు సీటు విషయంలో గ్యారెంటీ లేదు.
ఇక్కడ కూడా టిడిపి కాస్త వెనుకబడి ఉంది. ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే టిడిపికి ప్లస్ అవుతుంది..లేదంటే ఇక్కడ కూడా వైసీపీ హవా ఉంటుంది. మొత్తానికి విశాఖ సిటీలో టిడిపికి రెండు స్థానాల్లో పట్టు ఉంది..పొత్తు ఉంటే మళ్ళీ సిటీలో సత్తా చాటవచ్చు. లేదంటే వైసీపీకి ఛాన్స్ ఉంది.