Site icon Neti Telugu

విజయనగరంలో టీడీపీ టార్గెట్ ఆ సీట్లే!

గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో విజయనగరం కూడా ఒకటి..కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పాటు విజయనగరంలో వైసీపీ స్వీప్ చేసింది. అయితే మిగిలిన మూడు జిల్లాలు ఓకే గాని..విజయనగరంలో టీడీపీ ఆ స్థాయిలో ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. కనీసం రెండు సీట్లు అయిన గెలుస్తుందని అనుకున్నారు. కానీ అది జరగలేదు. కానీ ఆ పరిస్తితి నుంచి టీడీపీ నిదానంగా బయటపడుతూ వస్తుంది. జిల్లాలో అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండటం, టీడీపీ నేతలకు బలం పెరుగుతుండటంతో సీన్ మారుతుంది.

జిల్లాలో కొన్ని సీట్లలో టీడీపీకి పట్టు పెరిగిందని తెలుస్తోంది..అయితే ఈ సారి జిల్లాలో ఖచ్చితంగా 9కి 6 సీట్లు గెలుస్తామని సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అంటున్నారు. జిల్లాలో సర్వే చేశామని 6 సీట్లలో టీడీపీ గెలుపుకు అనుకూలంగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే అయ్యన్న చెబుతున్నా ప్రకారం జిల్లాలో..టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్న సీట్లు..బొబ్బిలి, విజయనగరం, శృంగవరపుకోట…ఈ మూడు సీట్లలో డౌట్ లేకుండా గెలుస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

అలాగే నెల్లిమర్ల, పార్వతీపురం, గజపతినగరం సీట్లలో కూడా సత్తా చాటుతామని ధీమాగా ఉన్నారు. ఇక సాలూరు, కురుపాం, చీపురుపల్లి స్థానాల్లో వైసీపీ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గజపతినగరంలో కూడా వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. ఇటు కురుపాంలో వైసీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీ  వాణిపై నెగిటివ్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇక్కడ టీడీపీ బలపడితే సత్తా చాటవచ్చు. మొత్తానికి విజయనగరంలో 6 సీట్లు గెలవాలని టీడీపీ టార్గెట్ గా పెట్టుకుంది. 

Exit mobile version