ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తప్పటం లేదు. ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు… సీనియర్ మంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో ఏదో చేస్తున్నామని పైకి చెప్పుకుంటున్నా… చివరకు మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో చిన్నచిన్న రహదారుల మరమ్మతులు కూడా చేయించలేని పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది మంత్రులు కూడా ధైర్యంగా తమ నియోజకవర్గాల్లో గ్రామాల్లో తిరగటం లేనొ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మరి కొన్నిచోట్ల మంత్రులు తమ పార్టీ నేతలకు న్యాయం చేయలేక పోతున్నారు. దీంతో వారంతా ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు.

అప్పలరాజుపై సొంత పార్టీ నేతల గుస్సా…
శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సీదిరి అప్పలరాజుకు ఇప్పుడు నియోజకవర్గంలో వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు అన్న విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అప్పలరాజు దూకుడు జిల్లా వైసీపీలోనే సీనియర్లు సైతం రుచించడం లేదు. వారు కూడా సరైన టైమ్ కోసం ఎదురు చూస్తున్నారు.

నియోజకవర్గంలోనూ వ్యతిరేకతే…
ఇదిలా ఉంటే పలాస నియోజకవర్గంలోనూ మంత్రిపై సొంత పార్టీ నేతల్లోనే కాకుండా.. చివరకు వైసీపీ వాళ్లు నియమించుకున్న వలంటీర్లలో కూడా ఉన్నట్టు కనపడుతోంది. తాజాగా పలాస మండలం లోని గురుదాసు పురం పంచాయతీకి చెందిన నలుగురు వలంటీర్లు తమ ఉద్యోగాలకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పంచాయతీకి చెందిన గిరి, ఢిల్లీ, రమేష్, చైతన్య మీ వలంటీర్ ఉద్యోగాలు మా కొద్దు బాబోయ్ అని దండం పెట్టడంతో పాటు వైసీపీకి గుడ్ బై చెప్పేసి పలాస ఇన్‌చార్జ్ గౌతు శిరీష సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.

ప్రభుత్వంపై ఉన్న తీవ్రమైన వ్యతిరేకత కారణంగానే తాము వలంటీర్ పదవులకు గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరామని వారు టీడీపీ కార్యకర్తల సమావేశం సాక్షిగా చెప్పడం ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మంత్రికి సంబంధించిన కొందరు అనుచరులు నియోజకవర్గంలో రెచ్చిపోతూ ఉండడం, సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో కూడా మంత్రిపై వ్యతిరేకతకు కారణమవుతోందని నియోజకవర్గ జనాలు చర్చించుకుంటున్నారు. ఇక అప్పలరాజు నిత్యం వార్తల్లో ఉండేందుకు చేస్తోన్న ప్రయత్నాలు కూడా కొన్ని సార్లు బూమరాంగ్ అవుతున్నాయని స్థానికంగా చర్చ నడుస్తోంది.

ఇవన్నీ మంత్రిపై తీవ్రమైన వ్యతిరేకతకు కారణం అవుతున్నాయి. ఇదిలా ఉంటే మంత్రి నియోజకవర్గంలో వలంటీర్లు టీడీపీలో చేరడం ఇప్పుడు స్టేట్ వైడ్ హాట్ టాపిక్ అయ్యింది.

Discussion about this post