రాజకీయ వ్యూహాలు పన్ని..ఉన్నది లేనట్లుగా..లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి..ప్రత్యర్ధులని దెబ్బకొట్టడంలో వైసీపీ ఎప్పుడు ముందే ఉంటుందని చెప్పవచ్చు. గత ఎన్నికల ముందు నుంచి..ఇప్పటివరకు వైసీపీ అలాంటి తరహా వ్యూహాలతోనే ముందుకెళుతుంది. పైగా ఇప్పుడు అధికారంలో ఉండటం వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి తీరాలనే విధంగా వైసీపీ రకరకాల వ్యూహాలు వేస్తుంది. ఇదే క్రమంలో గృహసారథిలని, కన్వీనర్లని నియమించిన విషయం తెలిసిందే. ప్రతి 50 ఏళ్ళకు ముగ్గురు గృహసారథిలని పెట్టి..వారు ప్రతి ఇంటికెళ్ళి జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పి..వారు వైసీపీకే ఓటు వేసేలా చేయడమే వారి పని.

అదే సమయంలో సచివాలయ ఉద్యోగులని, వాలంటీర్లని సైతం రాజకీయంగా వాడుకునే పనిలో వైసీపీ ఉంది. ఈ మధ్య సచివాలయ, వాలంటీర్లతో వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశమై..వైసీపీని గెలిపించేలా పనిచేయాలని సూచిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థని రాజకీయంగా వాడుకోవడానికి చూస్తున్నారు. వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించి..వారికి నెలకు ప్రభుత్వం నుంచి 5 వేల రూపాయలు ఇస్తున్న విషయం తెలిసిందే.

అయితే వాలంటీర్లు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉన్న విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక పథకాల మొత్తం వారి చేతుల్లోనే ఉండటంతో…ప్రజలని వైసీపీకి ఓటు వేసేలా వారు కీలక పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బహిరంగ వేదికలపై వారు..వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఇక వాలంటీర్ వ్యవస్థతోనే గెలవాలని ప్రతి ఎమ్మెల్యే చూస్తున్నారు.

మరి వాలంటీర్ల చేత రాజకీయం చేయించడం పై మున్ముందు ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మొత్తానికి వాలంటీర్లే వైసీపీకి ప్రధాన బలంగా ఉన్నారని చెప్పవచ్చు.

Leave feedback about this