టీడీపీలో వ్యూహాత్మక రాజకీయం జరుగుతోంది. సంఖ్యా పరంగా చూసుకుంటే. టీడీపీకి బాగానే నాయకులు ఉన్నారు. పైగా.. వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యూహాత్మకంగా.. అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం .. ఇ లాంటి వారంతా కూడా.. వచ్చే ఎన్నికల్లో.. పార్టీని గెలిపించాలని.. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు. పదే పదే వారికి సూచనలు కూడా చేస్తున్నారు. అయితే.. సీనియర్లు.. వ్యాపారులు… పారిశ్రామిక వేత్తలు.. ఇలా.. అనేక మంది మాత్రం మౌనంగా ఉంటున్నారు.

అలాగని.. వీరికి చంద్రబాబుపై ప్రేమ లేదని కాదు.. టీడీపీపై అభిమానం అంతకన్నా లేదని కాదు. కానీ, వీరంతా.. `వ్యూహాత్మక రాజకీయం`చేయడంలో దిట్టలు. అవసరాన్ని బట్టి.. రాజకీయాలు చేయడం.. అవసరం మేరకు వ్యవహరించడం.. వంటివి.. వారికి రాజకీయంగానే అబ్బిన విద్యలు. దీంతో వారు తమ ఆనుపానులతోపాటు.. టీడీపీ ఆనుపానులు కూడా చూసుకుంటున్నారు. అంటే.. ఇప్పటికిప్పుడు వారు ఎలాంటి హడావుడి చేయరు. చంద్రబాబు మాటలను జాగ్రత్తగా ఆలకిస్తారు.

కానీ, ఆయన చెప్పినట్టు మాత్రం బయటకు రారు. ఎందుకంటే.. వీరికి అటు అధికార పార్టీ, ఇటుప్రతిపక్ష పార్టీ కూడా ముఖ్యమే! ఆశ్చర్యంగా ఉన్నా.. నిజం. ఎందుకంటే.. టీడీపీలోనే ఉన్న వీరు.. ఖర్చులకు ఎక్కడా వెనుకాడరు. కానీ, ఫక్తు బిజినెస్ మైండ్. ఖర్చు పెట్టే ప్రతిరూపాయికి.. కూడా వాల్యూ రావాలని కోరుకుంటారు. అంటే.. తమకు ఫలితం వస్తేనే వీరు ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉంటారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని భారీ ఎత్తున ప్రచారం జరగడంతో వీరు కూడా అదేరేంజ్‌లో డబ్బుఖర్చు చేశారు. తీరా పరిస్థితి తిరగబడింది. దీంతో .. ఇప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధి కారంలోకి వచ్చే సూచనలు ఉంటేనే బయటకు రావాలని.. లేక పోతే.. వద్దని కూడా వీరు డిసైడ్ అయిన ట్టు పార్టీలో గుసగుస వినిపిస్తోంది. మరోవైపు… వీరు అవసరం అనుకుంటే. వైసీపీలోకి చేరిపోయే అవకాశం కూడా ఉంటుంది. పైన చెప్పుకొన్నట్టుగా.. వీరికి వ్యూహాత్మక రాజకీయం అవసరం. వీరికి శాశ్వత పార్టీ.. శాశ్వత శత్రుపార్టీ అంటూ ఏదీ ఉండదు. అయితే.. ఇది టీడీపీకి మంచిది కాదని.. చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే.. ఇలా ఏం జరుగుతుందో చూసి.. అప్పుడు రాజకీయం చేయాలనుకునే వారికి చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.

Discussion about this post