ఢిల్లీ మద్యం కేసుల్లో ఈడి విచారణలు ఎదుర్కొంటున్న ఎమ్మల్స్ కవితను ఉద్దేశించి భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని తాను సమర్థించనని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం ఢిల్లీలో ఉన్న తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ఆ వ్యాఖ్యలకు బండి సంజయే వివరణ ఇచ్చుకోవాలన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం అధికార కేంద్రం కాదని, అది కేవలం సమన్వయ స్థానమేనని పేర్కొన్నారు. వారికి విపరీతమైన బాధ్యతలు ఉంటాయన్నారు. అందువల్ల ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. తెలంగాణలో చాలా సామెతలుఉంటాయని.. వాటి వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. .

అరవింద్ చేసిన వాక్యాలను సమర్థిస్తూ తగుదునమ్మా అని కొందరు బిజెపిలో అసంతృప్తి నేతలు సోషల్ మధ్యమాలలో దొరికిందే సందు అనుకుంటూ బండి సంజయ్ ని విమర్శిస్తూ పోస్టులు చేస్తున్నారు.ముఖ్యంగా ఎప్పటినుంచో అసంతృప్తిగా ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడు శేఖర్ రావు పేరాల ఛాన్స్ దొరికిందని బండి సంజయ్ గురించీ వ్యతిరేకంగా పోస్టింగ్ చేయడం పార్టీ కార్యకర్తలకు మింగుడు పట్టని విషయం .

అరవింద్ మీద మరల దాడి జరుగుతుందని భయపడి బండి సంజయ్ గురించి విషం చిమ్మాడు అని సోషల్ మీడియాలో కార్యకర్తలు అరవింద్ పై తారాస్థాయిలో మండిపడుతున్నారు . ఇది ఇలా ఉండగా అధికార పార్టీ బిఆర్ఎస్ తో యుద్ధం చేస్తునా తరుణంలో నేతల మధ్య కోల్డ్ వార్ కు కౌంటర్ గా యావత్ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఎవరున్నా లేకపోయినా , వేరే పార్టీలకు అమ్ముడుపోయినా బండి సంజయ్ పై కుట్ర చేస్తే సహించేది లేధు అంటూ బండి సంజయ్ కు మదత్తుగా సోషల్ మాధ్యమాలలో #we are with bandi sanjay anna , #Bycottcoverts అని ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ వివాదం ముదరక ముందే బీజేపీ పార్టీ హై కమాండ్ ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది.
