జగనన్న మా భవిష్యత్…మా నమ్మకం నువ్వే జగన్…జగనన్నకు చెబుదాం..ఇవి ఏపీలో కొత్తగా వైసీపీ చేస్తున్న కార్యక్రమాలు..ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లని ప్రతి ఇంటికి అంటించేలా వైసీపీ కార్యక్రమం మొదలుపెట్టింది. అంటే జనం నమ్మకం జగన్ అనుకునే విధంగా ఇళ్లకు స్టిక్కర్లు అంటించే కార్యక్రమం మొదలుపెట్టారు.
అయితే పార్టీ పరంగా కార్యక్రమం చేయడంలో ఇబ్బంది లేదు..కానీ ప్రజల ఇళ్లకు జగన్ బొమ్మ ఉన్న స్టిక్కర్ అంటించడమే ఇబ్బంది. వైసీపీ కార్యకర్తల ఇళ్లకు అంటించుకున్న తప్పు లేదు. కానీ సామాన్య ప్రజల ఇళ్లకు అంటించడం ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే కనబడిన ప్రతి దానికి వైసీపీ రంగులు వేశారు..ప్రతి దానిపై జగన్ బొమ్మ..ఆఖరికి పొలం డాక్యుమెంట్లు, పాస్ బుక్‌పై కూడా జగన్ బొమ్మ..ఇప్పుడు ఇంటికి బొమ్మ. అయితే మా నమ్మకం నువ్వే జగన్ అనుకునేవారు ఇళ్లకు అంటించడంలో తప్పు లేదు. కానీ అందరి ఇళ్లకు అంటించడమే తప్పు.

ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ ఒక్కటే లేదు..వైసీపీని అభిమానించే వారే లేరు..టిడిపి, జనసేన, బిజేపి, కాంగ్రెస్, కమ్యూనిస్టులని అభిమానించే వారు కూడా ఉన్నారు. వారి ఇళ్లకు ఎలా స్టిక్కర్లు అంటిస్తారనే విమర్శలు వస్తున్నాయి. సరే పథకాలు ఇస్తున్నారు..వారి ఇళ్లకు అంటిస్తారని అనుకుంటే…అందులో ఎంతమంది మా నమ్మకం నువ్వే జగన్ అనుకుంటున్నారంటే..అందులో కొంతమంది అనుకోవచ్చు..కానీ పథకాల పేరిట రూపాయి ఇచ్చి..పన్నుల పేరిట 10 రూపాయిలు కొట్టేస్తున్నారని తెలుసుకున్న ప్రజలు అనుకోరు.
అలాగే పథకాలు అందని వారు ఎలాగో మా నమ్మకం నువ్వే జగన్ అని అనుకోరు. అంటే ఎటు తిప్పిన జగన్ పై నమ్మకం ఉన్నవారు తక్కువే. అలాంటప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ అనే ప్రోగ్రాం వర్కౌట్ అవ్వదనే చెప్పాలి.