రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బలం పెంచడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడకక్కడ పార్టీని బలోపేతం చేసుకుంటూ, నేతలకు దిశానిర్దేశం చేసుకుంటూ వస్తున్నారు. దీంతో ప్రతి స్థానంలో టిడిపి గెలవాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు. ఇదే సమయంలో వైసీపీకి పట్టున్న కంచుకోటలపై కూడా బాబు ఫోకస్ పెట్టారు. టీడీపీ గెలుపుకు దూరమైన స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి..ఇప్పుడు ఆ స్థానాల్లో గెలవాలని చూస్తున్నారు.
ఈ క్రమంలోనే టిడిపికి ఏ మాత్రం పట్టు లేని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంపై బాబు ఫోకస్ పెట్టారు. ఆ ప్రాంతంపై మొదట నుంచి టిడిపికి పట్టు లేదు. రెడ్డి, ఎస్సీ వర్గం ఓట్లు ఎక్కువ ఉండటం..వారు మొదట నుంచి కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీకి అండగా ఉండటంతో టిడిపి గెలవడం సాధ్యపడటం లేదు. పశ్చిమ ప్రకాశంలో ఉన్న గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం సీట్లలో టిడిపికి పెద్ద పట్టు లేదు. ఈ స్థానాల్లో టిడిపి గెలిచి కూడా చాలా ఏళ్ళు అవుతుంది.

గిద్దలూరులో 1999 ఎన్నికల్లో చివరిగా గెలిచింది..మళ్ళీ ఇంతవరకు గెలవలేదు. అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది. దీంతో టిడిపికి ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో బాబు గిద్దలూరులో పర్యటించనున్నారు. ఈ నెల 19న ఆయన గిద్దలూరుకు వెళ్తారు. 20న మార్కాపురంకు వెళ్లనున్నారు. అక్కడ కూడా టిడిపికి పట్టు లేదు. 21న యర్రగొండపాలెంలో పర్యటించనున్నారు.
ఇక్కడ అసలు టిడిపి ఇంతవరకు గెలవలేదు. గత రెండు ఎన్నికల్లో ఈ మూడు స్థానాల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. ఇప్పటికీ కాస్త వైసీపీకే ఎడ్జ్ ఉంది. ఈ నేపథ్యంలో బాబు ఆ స్థానాలపై ఫోకస్ పెట్టి టిడిపి బలం పెంచేలా పర్యటన చేయనున్నారు. మరి చూడాలి బాబు పర్యటనతో అయినా పశ్చిమ ప్రకాశంపై టిడిపికి పట్టు పెరుగుతుందేమో.