గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో ఎంతమంది కమ్మ తమ్ముళ్ళు ఓడిపోయారో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కమ్మ నేతలు ఓటమి పాలయ్యరు. అలా ఓటమి పాలైన కమ్మ నేతలు..వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. అందుకు తగిన విధంగా రాజకీయం చేస్తూ బలపడుతూ వస్తున్నారు.

ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఉన్న ముగ్గురు కమ్మ నేతలు ఈ సారి ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, తణుకు నుంచి అరిమిల్లి రాధాకృష్ణా, ఉంగుటూరు నుంచి గన్ని వీరాంజనేయులు, నిడదవోలు నుంచి బూరుగుపల్లి శేషారావు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నలుగురు కమ్మ నేతలే. అయితే ఈ సారి ఎన్నికల్లో శేషారావుకు సీటు దక్కుతుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఆయన్ని పక్కన పెడితే..మిగిలిన ముగ్గురికి సీట్లు ఫిక్స్.




దెందులూరులో చింతమనేని, ఉంగుటూరులో గన్ని, తణుకులో అరిమిల్లి పోటీ చేయనున్నారు. అలాగే ఈ ముగ్గురు నేతలు బాగా దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా వీరు ఉన్న స్థానాల్లో వైసీపీ సిట్టింగులపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నేతలకు ఈ సారి గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా జనసేనతో పొత్తు ఉంటే ఆ ముగ్గురు నేతలకు అడ్వాంటేజ్ అవుతుంది.ఇప్పటికే ఆ ముగ్గురు నేతలు పుంజుకున్నారు..తణుకులో అరిమిల్లికి ఎక్కువ ప్లస్ కనిపిస్తుంది. మొత్తానికి ఈ సారి కమ్మ నేతలు సత్తా చాటేలా ఉన్నారు
