ఏపీ మంత్రుల పనితీరు ఎలా ఉంది? ఏ మంత్రి అద్భుతంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు? అంటే అసలు మంత్రులు ఏం పనిచేస్తున్నారనే ప్రశ్న ప్రజల నుంచి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…ఎందుకంటే మంత్రులు అనేవారు కేవలం సంతకాలు పెట్టడానికి తప్ప…సొంతంగా వారు ప్రజలకు చేసేది ఏమి లేదని..ఏదైనా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లే జరగాలని చెబుతున్నారు. ఎవరికి సొంతంగా పనిచేసే సత్తా మాత్రం కనిపించడం లేదని అంటున్నారు.

అయితే ఉన్న మంత్రుల్లో బెస్ట్ అంటే ఇటీవల చనిపోయిన మేకపాటి గౌతమ్ రెడ్డి అని అందరు చెబుతున్నారు…ఆయనే టాప్‌లో ఉన్నారని, కానీ ఇప్పుడు ఆయన లేరని చెబుతున్నారు. ఇక గౌతమ్ రెడ్డి విషయం పక్కనబెడితే మిగిలిన వారిలో కొద్దో గొప్పో బెటర్‌గా పనిచేసే వారు ఎవరంటే…చెప్పడానికి పెద్దగా ఎవరు ఉన్నట్లు కనిపించడం లేదని అంటున్నారు. అవ్వడానికి బొత్స సత్యనారాయణ సీనియర్ మంత్రి అని…గతంలో కాంగ్రెస్‌లో ఉండగా ఈయన హవా నడిచిందని, అయితే ఇప్పుడు బొత్స కూడా వేరే వాళ్ళు చెబితే చేయడమే అన్నట్లు ఉన్నారని చెప్పుకుంటున్నారు.

ఉన్న మంత్రుల్లో ప్రత్యేకంగా గొప్ప పనితీరు కనబర్చే వాళ్ళు మాత్రం కనబడటం లేదనే చెబుతున్నారు..అయితే రాజకీయంగా ప్రత్యర్ధులని తిట్టడంలో, ఇక మీడియా ముందుకొచ్చి చంద్రబాబు, పవన్‌లపై విరుచుకుపడటంలో మాత్రం కొందరు టాప్‌లోనే ఉన్నారని అంటున్నారు..కొడాలి నాని, పేర్ని నాని, అప్పలరాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు ప్రత్యర్ధులని తిట్టడం కోసం స్పెషల్‌గా ఉన్నారని తెలుస్తోంది. హోమ్ మంత్రి సుచరిత పేరుకే హోమ్ మంత్రి అంటున్నారు.

అటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమో ప్రత్యేకంగా అప్పులు చేయడానికే ఉన్నారని సెటైర్లు వస్తున్నాయి…ఇక ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే…కొందరు మంత్రులు అనే సంగతి చాలామంది ప్రజలకు తెలియకపోవడం…అంటే ఆ మంత్రుల పనితీరు అలా ఉందని చెప్పొచ్చు. కాబట్టి మంత్రుల్లో ఎవరు టాప్‌లో ఉన్నారో ప్రజలకు బాగా క్లారిటీ ఉందని చెప్పొచ్చు.

Discussion about this post