ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ డౌట్ లేకుండా గెలిచే నియోజకవర్గాల్లో తాడికొండ ఒకటి అని చెప్పవచ్చు. పూర్తిగా రాజధాని అమరావతి పరిధిలో ఉన్న తాడికొండలో గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. రాజధాని తీసుకొచ్చిన సరే అక్కడి ప్రజలు టిడిపిని కాకుండా వైసీపీని గెలిపించారు. వైసీపీ నుంచి ఉండవల్లి శ్రీదేవి గెలిచారు. కానీ జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని దెబ్బతీస్తూ..మూడు రాజధానులు అన్నారు.
దీంతో తాడికొండలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది. అయితే ఆమె ఇటీవల వైసీపీ నుంచి బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె సైలెంట్ అయ్యారు..హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే..తాడికొండ టిడిపి ఇంచార్జ్ గా తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. ఇటు వైసీపీ నుంచి డొక్కా మాణిక్యవరప్రసాద్ గాని, కత్తెర సురేశ్ గాని పోటీ చేసే ఛాన్స్ ఉంది.

అయితే టిడిపి సీటు తెనాలికే ఇస్తారా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆ సీటుని ఇంకా ఫిక్స్ చేయడం లేదు. 2014లో శ్రావణ్ పోటీ చేసి గెలిచారు..2019లో ఓటమి పాలయ్యారు. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ చంద్రబాబు ఇంకా సీటు తేల్చలేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు తాడికొండలో పర్యటించడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 27వ తేదీన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ క్రమంలో ఆయన తాడికొండ సీటు ఫిక్స్ చేస్తారేమో చూడాలి.
మెజారిటీ కేడర్ శ్రావణ్ వైపే ఉన్నారు..ఆయన గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇదే క్రమంలో అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావుకు సీటు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. దీంతో శ్రావణ్‌ని బాపట్ల ఎంపీగా పంపిస్తారనే టాక్ వస్తుంది. చూడాలి మరి చివరికి తాడికొండ సీటు ఎవరికి ఫిక్స్ చేస్తారో.