తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. అసలు ఆయన వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తూ..టిడిపినే టార్గెట్ చేయడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. అదే సమయంలో కేశినేనిని సైతం కొందరు టిడిపి నేతలు టార్గెట్ చేస్తూ రావడం వల్లే…ఇప్పుడు కేశినేని రివర్స్ అయ్యారనే ప్రచారం ఉంది. మామూలుగా విజయవాడలో కేశినేనికి..బుద్దా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా లాంటి నేతలతో పడదు. వారి మధ్య అంతర్గత పోరు జరుగుతూ వచ్చింది. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మరింత ఎక్కువైంది.
అప్పుడు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. చంద్రబాబు రంగంలోకి వారికి సర్దిచెప్పారు. దీంతో నేతలు వెనక్కి తగ్గారు. కానీ ఏమైందో గాని..సడన్ గా కేశినేని సోదరుడు చిన్ని విజయవాడ పార్లమెంట్ పరిధిలో పనిచేయడం మొదలుపెట్టారు. ఆయనకు కేశినేని నాని వ్యతిరేక వర్గం సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ విజయవాడ ఎంపీ సీటు ఆయనకే అంటున్నారు. ఈ క్రమంలో కేశినేని నాని రివర్స్ అవ్వడం మొదలుపెట్టారు. పార్లమెంట్ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తూ వారిని పొగుడుతున్నారు.

దీంతో టిడిపి నేతలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా మైలవరం, నందిగామ స్థానాల్లోనే వైసీపీ ఎమ్మెల్యేలతో నాని ఎక్కువ ఉంటున్నారు. ఆ స్థానాల్లో టిడిపి నేతలు దేవినేని ఉమా, తంగిరాల సౌమ్యలకు ఇబ్బంది అవుతుంది. అదే సమయంలో విజయవాడ టిడిపి సీటు ఏ పిట్టల దొరకు ఇచ్చిన తనకు ఇబ్బంది లేదని, ప్రజలు కోరుకుంటే తాను ఇండిపెండెంట్ గా గెలుస్తానేమో అని బాంబు పేల్చారు.
అంటే టిడిపి సీటు కేశినేని నానికి దక్కదు అని తెలుస్తుంది. అందుకే ఆయన ఇండిపెండెంట్ అంటున్నారు. అయితే నానికి సర్దిచెబితే సమస్యలు తగ్గే ఛాన్స్ ఉంది..లేదంటే వదిలేయాలని చూస్తే మాత్రం ఆయన దారి ఆయన చూసుకుంటారు. చూడాలి మరి బాబు ఏం చేస్తారో.