జమ్మలమడుగు..కడప జిల్లాలో వైసీపీ కంచుకోటల్లో ఇది ఒకటి. ఇక్కడ గత రెండు ఎన్నికల నుంచి వైసీపీ గెలుస్తూ వస్తుంది..ఇక ముచ్చటగా మూడోసారి కూడా గెలవాలని వైసీపీ చూస్తుంది. కానీ వైసీపీకి బ్రేకులు వేసి..జమ్మలమడుగులో పసుపు జెండా ఎగరవేయాలని టిడిపి శ్రేణులు చూస్తున్నాయి. మరి అక్కడ ఇప్పుడు ఎలాంటి పరిస్తితులు ఉన్నాయి..ఎవరికి అనుకూల వాతావరణం ఉందనే విషయం ఒక్కసారి చూసే ముందు జమ్మలమడుగు నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే..మొదట్లో ఇక్కడ కాంగ్రెస్ హవా ఎక్కువ నడిచేది.
1983లో టిడిపి వచ్చాక సీన్ మారిపోయింది…1983 నుంచి జమ్మలమడుగులో టిడిపి హవా నడుస్తుంది. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా అయిదుసార్లు టిడిపి విజయం సాధించింది. కానీ తొలిసారి 2004లో వైఎస్సార్ వేవ్ లో జమ్మలమడుగులో టిడిపి ఓడిపోయింది..కాంగ్రెస్ గెలిచింది. 2009లో కూడా కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ నుంచి ఆదినారాయణ రెడ్డి గెలిచారు. 2014 నుంచి జమ్మలమడుగు వైసీపీ హవా మొదలైంది..అప్పుడు వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ..తర్వాత టిడిపిలోకి వచ్చారు.

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా సుధీర్ పనిచేస్తున్నారు. ఆయన దూకుడుగానే ముందుకెళుతున్నారు. కాకపోతే అభివృద్ధి పరంగా వెనుకబడి ఉన్నారు. సంక్షేమ పథకాలు కాస్త ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అటు టిడిపి నుంచి ఆదినారాయణ సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్నారు.
అయితే ఎన్నికల సమయంలో ఆదినారాయణ టిడిపిలోకి వచ్చి మళ్ళీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల లోకేశ్ పాదయాత్ర కూడా మొదలైంది. దీని వల్ల జమ్మలమడుగులో టిడిపికి కాస్త పాజిటివ్ కనిపిస్తుంది. అలా అని ఇక్కడ వైసీపీని ఎదురుకోవడం అంత ఈజీ కాదు. టిడిపి బాగా కష్టపడితేనే..జమ్మలమడుగులో గెలవడానికి ఛాన్స్ లేదంటే..కష్టమే.