ఆంధ్రప్రదేశ్ లో టిడిపి జనసేన పొత్తు తర్వాత రాజకీయాలు వేగంగా మారాయని చెప్పవచ్చు. ఉభయ గోదావరి జిల్లాలలో జనసేనకు పూర్తిగా పట్టు ఉంది. ఈ విషయం అందరికీ తెలిసినదే. అమలాపురం పార్లమెంటు సెగ్మెంట్లో ఈసారి టిడిపి జనసేన పొత్తు అభ్యర్థి గెలుస్తారా లేక పొత్తు కుదరక వైసిపి గెలుస్తుందా అని రాజకీయ విశ్లేషకులు అందరూ చర్చించుకుంటున్నారు.
అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ కింద రామచంద్రాపురం, అమలాపురం, పి గన్నవరం, కొత్తపేట, రాజోలు, ముమ్మిడివరం, మండపేట ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో దాదాపు అన్ని స్థానాలలో టిడిపి జనసేన పొత్తు అభ్యర్థులే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ జనసేన పట్టుంది. వీటిలో రెండు స్థానాలు జనసేన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజోలులో గతంలో విజయం సాధించిన రాపాక జనసేనకు గట్టి షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇప్పుడు అదే రాజోలులో మళ్ళీ జనసేన తన సత్తా చాటాలని ఎదురుచూస్తోంది.
అమలాపురం పార్లమెంటు స్థానం ఎస్సీ రిజర్వుడ్ స్థానం. ఇక్కడ టిడిపి అభ్యర్థిగా చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. జిఎంసి బాలయోగి కుమారుడు హరీష్, గొల్లపల్లి సూర్యారావు, టిఎన్ఎస్ మూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, హర్ష కుమార్ వీరందరి పేర్లు పరిశీలనలో ఉండగా, హర్షకుమార్ చివరిగా అమలాపురం టిడిపి పార్లమెంటు అభ్యర్థి అవుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే అమలాపురంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయం సాధించాలి అంటే ఆర్థికంగా బలమైన నాయకుడు కావాలి. వైసిపి తరఫున చింత అనురాధ ఉన్నారు. మరి ఇప్పటికే అమలాపురంలో వైసిపిఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అంతేకాకుండా నియోజకవర్గ ప్రజలలో వైసిపి అంటే వ్యతిరేకత ఉంది. అభివృద్ధి శూన్యం వీటన్నింటినీ టిడిపి జనసేన పొత్తులో టిడిపి తనకు అనుకూలంగా మార్చుకుంటే టిడిపి విజయం సాధించడానికి గట్టి ప్రయత్నమే చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అసలే అమలాపురంలో గెలుపు అంత సులువు కాదు కదా…..!