Site icon Neti Telugu

ఆళ్లగడ్డలో 1999 సీన్ రిపీట్ అవుతుందా?

ఆళ్లగడ్డ..టీడీపీ అడ్డా..ఇది తాజాగా భూమా విఖ్యాత్ రెడ్డి..నారా లోకేష్ పాదయాత్రలో చెప్పిన మాట. మరి నిజంగానే ఆళ్లగడ్డ టి‌డి‌పి అడ్డానే అంటే..కాదనే చెప్పాలి. ఇది ఒకప్పుడు మాట మాత్రమే…ఇప్పుడు వైసీపీ కంచుకోటగా ఉంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వచ్చింది. ఇప్పటికీ అక్కడ వైసీపీకే లీడ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. మరి అలాంటి చోట టి‌డి‌పి గెలుస్తుందా? లోకేష్ పాదయాత్ర ఎంతవరకు ఉపయోగపడుతుందా? అనే అంశాలు చూస్తే.

మొదట ఆళ్లగడ్డ గురించి మాట్లాడుకుంటే..మొదట్లో ఇక్కడ కాంగ్రెస్ హవా ఉండేది..అయితే 1983, 1985 ఎన్నికల్లో కూడా..టీడీపీ హవా అక్కడ నడవలేదు. ఇక 1989లో ఆళ్లగడ్డలో తొలి విజయం అనుకుంది. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. 1994ఎలో భూమా నాగిరెడ్డి, 1999లో శోభా నాగిరెడ్డి గెలిచారు. 2004లో ఓడిపోగా, ఆ తర్వాత భూమా ఫ్యామిలీ ప్రజారాజ్యంలోకి వెళ్లింది. దీంతో ఆళ్లగడ్డలో టి‌డి‌పికి ఇబ్బందులు మొదలయ్యాయి.

2009లో ప్రజారాజ్యం నుంచి శోభా గెలిచారు. తర్వాత ఆమె వైసీపీలోకి వెళ్ళి 2012 ఉపఎన్నికలో గెలిచారు. 2014లో కూడా వైసీపీ నుంచి పోటీ చేశారు. ఎన్నికలు అయ్యాక కారు ప్రమాదంలో శోభా మరణించారు. ఇక ఎన్నికల ఫలితాల్లో శోభా నాగిరెడ్డి గెలవడం జరిగింది. తర్వాత ఉపఎన్నిక రావడంతో అఖిలప్రియ ఏకగ్రీవం అయ్యారు. తర్వాత తన తండ్రి నాగిరెడ్డితో కలిసి టి‌డి‌పిలోకి వచ్చారు.

2019 ఎన్నికల్లో అఖిల టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి బిజేంద్ర రెడ్డి గెలిచారు. అయితే ఇటీవల అక్కడ లోకేష్ పాదయాత్ర జరిగింది. పాదయాత్రతో పార్టీకి కాస్త ఊపు వచ్చింది. కాకపోతే భూమా అఖిల కొన్ని వివాదాల్లో ఉండటం మైనస్. ఇక సీటు ఎవరికి ఇస్తారో క్లారిటీ లేదు. ఇప్పటికీ అక్కడ టి‌డి‌పి కాస్త వెనుకబడి ఉన్నట్లే కనిపిస్తుని. మరి ఎన్నికల నాటికి ఏమైనా సీన్ మారుతుందేమో చూడాలి.

Exit mobile version