చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ అనుకున్న విధంగా పట్టు సాధించలేకపోతుందనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో అక్కడ వైసీపీ ఆధిక్యమే కొనసాగింది. ఈ సారి ఎన్నికల్లో కూడా అదే పరిస్తితి వచ్చేలా ఉంది. పైగా జిల్లాలో కొన్ని సీట్లలో టిడిపికి బలమైన నాయకత్వం కనిపించడం లేదు. అలాగే దూకుడుగా పనిచేస్తున్నట్లు లేరు. దీంతో పలు స్థానాల్లో టిడిపి ఇంకా వెనుకబడే ఉంది.
ఈ క్రమంలోనే తంబళ్ళపల్లెలో టిడిపి బాగా వెనుకబడి ఉంది. టీడీపీ ఇక్కడ నాలుగుసార్లు గెలిచింది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. టిడిపిపై వ్యతిరేకతతో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. ఈయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు అనే సంగతి తెలిసిందే. ఇక అక్కడ ద్వారకానాథ్ దూసుకెళుతున్నారు. అయితే వైసీపీలో ఉండే లోపాలని ఎత్తిచూపడం, ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో టిడిపి ఫెయిల్ అవుతుంది. ఇక్కడ టిడిపి ఇంచార్జ్ గా శంకర్ యాదవ్ ఉన్నారు.

2014లో ఈయనే ఎమ్మెల్యేగా గెలిచారు..కానీ అనుకున్న మేర పని చేయలేదు. ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నారు. దీంతో 2019లో ఓడిపోయారు. ఓడిపోయాక అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. దీంతో ఆయన్ని మార్చేసి కొత్త ఇంచార్జ్‌ని పెట్టాలని స్థానిక టిడిపి శ్రేణులు..చంద్రబాబుని కోరాయి. కానీ శంకర్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చి..బాబుని బ్రతిమాలడి..ఈ సరి బాగా పనిచేస్తానని ఇంచార్జ్ గా కొనసాగారు.
అయినా సరే నియోజకవర్గంలో మార్పు లేదు..అనుకున్న విధంగా పార్టీ బలపడలేదు. ఇప్పటికీ అక్కడ వైసీపీదే ఆధిక్యం ఉంది. ఈ నేపథ్యంలో టిడిపికి మరో బలమైన నాయకుడుని పెడతారా? లేక శంకర్‌ని కొనసాగించి తంబళ్ళపల్లెని మళ్ళీ కోల్పోతారేమో చూడాలి.