May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

 పెనుకొండలో వైసీపీకి ఎదురుగాలి..టీడీపీకి ఛాన్స్.!

ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలైతే సొంత పార్టీలోనే వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. అంటే ఆ ఎమ్మెల్యేల పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సొంత పార్టీ వాళ్ళు సైతం వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేల్లో పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కూడా ఒకరు.

గత ఎన్నికల్లో జగన్ గాలిలో గెలిచిన శంకర్..మంత్రిగా కూడా చేశారు. అయినా సరే పెనుకొండలో అభివృద్ధి లేదు. కానీ ఆయన ఫ్యామిలీ మాత్రం బాగుపడిందనే విమర్శలు వచ్చాయి. పెనుకొండలో ఎమ్మెల్యే లెక్కలేనంత అవినీతికి పాల్పడుతున్నారని టి‌డి‌పి ఆరోపణలు చేస్తుంది. టి‌డి‌పి వాళ్లే కాదు..సొంత పార్టీ వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఓ గ్రామానికి వెళితే..అక్కడ ఎమ్మెల్యేపై గ్రామస్తులు చెప్పులతో దాడి చేశారు. కారుపై చెప్పులు విసిరారు. సొంత ఎమ్మెల్యే కాబట్టి బట్టలు ఊడతీసి కొట్టలేదని అక్కడ కొందరు మాట్లాడటం బట్టి చూస్తే..ఎమ్మెల్యేపై ఎంత వ్యతిరేకత ఉందో అర్ధం చేసుకోవచ్చు.

దీంతో పెనుకొండలో వైసీపీకి ఫుల్ యాంటీ వచ్చింది..ఇక్కడ టి‌డి‌పి గెలుపుకు అవకాశాలు పెరిగాయి. మామూలుగానే పెనుకొండ టి‌డి‌పి కంచుకోట. 1983 నుంచి అక్కడ టి‌డి‌పి హవా సాగుతుంది. 1985లో గెలవగా, 1989లో ఓడిపోయింది..ఇంకా 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో టి‌డి‌పి వరుసగా గెలిచింది. కానీ గత ఎన్నికల్లో జగన్ గాలిలోనే ఓడిపోయింది.

ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉంది..దీంతో పెనుకొండలో మరొకసారి టి‌డి‌పి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే టి‌డి‌పి నుంచి బీకే పార్థసారథి పోటీ చేస్తారా? లేక సవితమ్మ పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. ఇద్దరు సీటు కోసం పోటీ పడుతున్నారు. మరి చంద్రబాబు ఎవరికి సీటు ఇస్తారో చూడాలి.