తూర్పు గోదావరి తుని నియోజకవర్గం పేరు చెబితే….మొదట గుర్తొచ్చేది టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ఎందుకంటే తుని అంటే యనమల..యనమల అంటే తుని మాదిరిగా చాలా కాలం రాజకీయం నడిచింది. కానీ ఆ పరిస్తితి ఇప్పుడు కనిపించడం లేదు. తుని పూర్తిగా వైసీపీ వశమైనట్లు కనిపిస్తోంది. అసలు యనమల…తుని నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

1983, 1985, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2009 ఎన్నికల నుంచి అసలు దరిద్రం మొదలైంది. 2009లో యనమల ఓడిపోయారు. 2014 ఎన్నికలోచ్చేసరికి యనమల పోటీ నుంచి తప్పుకున్నారు. టిడిపి తరుపున యనమల సోదరుడు యనమల కృష్ణుడు బరిలో దిగారు. అప్పుడు రాష్ట్రంలో టిడిపి గాలి ఉన్నా సరే తునిలో మాత్రం వైసీపీ తరుపున దాడిశెట్టి రాజా గెలిచారు. అప్పటికే యనమల ఫ్యామిలీ మీద వ్యతిరేకత ఉండటంతో తుని ప్రజలు రాజాని గెలిపించారు. అయితే టిడిపి అధికారంలోకి రావడంతో చంద్రబాబు, యనమలకు ఎమ్మెల్సీ ఇచ్చి, ఆర్ధిక మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇక ఆర్ధిక మంత్రిగా యనమల ఎలా పనిచేశారో అందరికీ తెలిసిందే.

అయితే మంత్రిగా ఉండి కూడా తన నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టలేకపోయారు. 2019 ఎన్నికల్లో మరోసారి యనమల సోదరుడు ఘోరంగా ఓడిపోయారు. మళ్ళీ రాజా గెలిచారు. ఇప్పుడు తుని నియోజకవర్గంలో పూర్తిగా వైసీపీ హవా నడుస్తోంది. పంచాయితీ ఎన్నికల్లో వైసీపీదే హవా. తుని మున్సిపాలిటీని కూడా వైసీపీన కైవసం చేసుకుంది. ఇక ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది.

ఇక్కడ టిడిపికి ఒక్క జెడ్‌పిటిసి స్థానం కూడా దక్కలేదు. 63 ఎంపిటిసి స్థానాల్లో టిడిపి గెలిచింది ఒక ఎంపిటిసి స్థానంలోనే అంటే తునిలో టిడిపి పరిస్తితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది. ఇదే పరిస్తితి కొనసాగితే మళ్ళీ ఎన్నికల్లో కూడా టిడిపి గెలుపు కష్టమే…ఇక తుని స్థానాన్ని టిడిపి కౌంట్ చేసుకోపోవడం బెటర్.

Discussion about this post