రాజకీయాల్లో స్టయిట్‌గా ఉండాలి. ప్రజలు కూడా దీనిని హర్షిస్తారు. కానీ, ఇప్పుడు అనుకున్నదే తడవుగా.. పుంజుకోవాలి. ప్రజల్లో పేరు వచ్చేయాలి. ప్రత్యర్థి పక్షాన్ని ఏదో ఒక విధంగా డ్యామేజీ చేయాలి. ఇదీ.. ఇప్పుడు వైసీపీలో పేటీఎం బ్యాచ్ లక్ష్యం. అందుకే.. అనవరసర విషయాలను.. వ్యక్తిగత అంశాలను కూడా రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలో టీడీపీ నాయకురాలు.. గౌతు లచ్చన్న మనవరాలు.. గౌతు శిరీష దూకుడుగా ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా శిరీష విజయం దక్కించుకోవడం ఖాయమనే.. అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను ఎదుర్కొనేందుకు ప్రజల్లోకి వెళ్లడం.. తాము చేసిన , చేస్తున్న మంచి పనులు చెప్పు కొనేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించాలి. కానీ, ఇవేవీ కనిపించకపోవడంతో వారు దొడ్డిదారులు.. దొంగదారులు వెతుక్కుంటున్నారన్న చర్చలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా శిరీషను ఇబ్బంది పెట్టి.. రాజకీయంగా పబ్బం గడుపుకొ నేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి సమాజంలో కులాలు.. మతాలు చాలా వరకు తగ్గిపోతున్నాయి.

అందరూ కూడా కులాంతర, మతాంత వివాహాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా వీటిని ప్రోత్సహి స్తున్నాయి. అయితే.. సీదిరి అప్పలరాజు నేతృత్వంలోని పెయిడ్ బ్యాచ్ మాత్రం శిరీషను కేంద్రంగా చేసుకుని.. తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గౌతు శిరీషను.. యార్లగడ్డ శిరీష చౌదరి అంటూ.. వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఒక సందర్భంలో మంత్రి అప్పలరాజు కూడా ఇదే వ్యాఖ్య చేశారు. తద్వారా.. బీసీ వర్గాలకు శిరీషను దూరం చేయాలని.. రాజకీయంగా వ్యూహం పన్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే.. ఒకవేలు.. శిరీష వైపు చూపిస్తే.. నాలుగు వేళ్లు వైసీపీవైపే చూపిస్తున్నాయ ని… టీడీపీ నేతలు అంటున్నారు. అప్పలరాజు కుంటుంబాన్ని తీసుకుంటే.. ఆయన సతీమణి కాళింగ సామాజికవ ర్గానికి చెందిన ఆడపడుచు. మరి అప్పలరాజు మత్య్స కార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి దీనిని బట్టి.. ఈయనను కాళింగ వర్గానికి చెందిన నాయకుడిగా పేర్కొనాలి. వాళ్లు అనుకూలంగా ఉండేందుకు రెండు వర్గాల్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు.కానీ, శిరీష్ భర్త కమ్మ కావడంతో ఆయనకు వ్యతిరేకంగా.. ఆమెను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

గౌతు శిరీష కాదు.. యార్లగడ్డ శిరీష చౌదరి.. అంటూ.. వ్యంగ్యంగా ప్రచారం చేస్తున్నారు. సరే.. ఇదెలా ఉన్నా.. ఆమె గౌతు లచ్చన్న మనవరావు, గౌతు శివాజీ కుమార్తె కాకుండా అయితే పోదుకదా!? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. కేవలం శ్రీకాకుళం జిల్లాలోనే కాదు.. తెలుగు నేలపై, తెలుగు వాళ్ల ఎక్కడ ఉన్నా.. ఎప్పటకీ గౌతు ఫ్యామిలీకి వాళ్ల మనసుల్లో పార్టీలు, కులాలు, వర్గాలతో సంబంధం లేకుండా చెక్కు చెదరని అభియానం ఉంటుంది.

ఇక సీదిరి & పెయిడ్ బ్యాచ్ చేస్తున్న ప్రచారం నిజమని అనుకుంటే.. వైఎస్ షర్మిల పరిస్థితి ఏంటి? ఆమెకు మాత్రం మినహాయింపు ఇవ్వాలా? దీనికి ఏమంటారు? తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కాలేదా? అలాంటప్పుడు గౌతు శిరీష అయితే.. తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా.. పెయిడ్ బ్యాచ్ ఇలాంటి విమర్శలు మానుకుని.. ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టిపెడితే ఆ విమర్శలకు కాస్త విలువ ఉంటుందంటున్నారు.


Discussion about this post