అధికార వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికలు టెన్షన్ గా మారాయి. ఇప్పటివరకు అధికార బలాన్ని, బెదిరింపులకు దిగో,,లేక దొంగ ఓట్లు సృష్టించో స్థానిక ఎన్నికలు గాని, ఉపఎన్నికలు గాని గెలిచారు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలావడానికి ఏ స్థాయిలో దొంగ ఓట్లు సృష్టించారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ నెల 23న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ అందులో దొంగ ఓట్లు సృష్టించడానికి వైసీపీకి ఛాన్స్ లేదు కదా అని టిడిపి శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.
అయితే 7 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోడానికి వైసీపీ ఎత్తులు వేస్తుంది. ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే కనీసం 22 టూ 23 మంది ఎమ్మెల్యేలు కావాలి. అయితే 6 స్థానాలని వైసీపీ ఈజీగానే గెలుచుకుంటుంది. కానీ 7వ స్థానంలో వైసీపీకి టిడిపి పోటీ ఇస్తుంది. ఇప్పటికే టిడిపి తరుపున పంచుమర్తి అనురాధ బరిలో దిగారు. మామూలుగా టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..కానీ అందులో నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు..వారు వైసీపీకి మద్ధతు ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో టిడిపి బలం 19 మాత్రమే ఉంటుంది.

కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది..వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి ఉన్నారు. వారు టిడిపికి మద్ధతు ఇస్తే 21 అవుతుంది..కానీ ఇంకా ఒకరిద్దరి సపోర్ట్ కావాలి. ఇప్పటికే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టిడిపి నేతలు అంటున్నారు. కానీ ఈ ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు కాకుండా ఇంకా ఏ వైసీపీ ఎమ్మెల్యే టిడిపి వైపు చుస్తున్నారో అర్ధం కాకుండా ఉంది.
కాకపోతే రెండు పార్టీలు విప్ జారీ చేసే ఛాన్స్ ఉంది..విప్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే అటు టిడిపి రెబల్, ఇటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడే ఛాన్స్ ఉంది. చూడాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో.