May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

వైసీపీ కుట్రలు..టీడీపీ చేతులెత్తేస్తుందా.? రివర్స్ ఎటాక్ లేదే.!

రాజకీయాన్ని రాజకీయంగా చేస్తే బాగానే ఉంటుంది..కానీ ఏపీలో వైసీపీ మాత్రం రాజకీయాల్లో కుట్రలు చేస్తుంది..ఫేక్ ప్రచారాలు చేస్తూ ఎంతసేపు ప్రత్యర్ధులని దెబ్బతీసే పనిలోనే వైసీపీ ఉంటుంది. గత ఎన్నికల నుంచి వైసీపీ అదే పనిలో ఉంది. అసలు గత ఎన్నికల ముందు ఎన్ని రకాలుగా ప్రచారం చేసి టి‌డి‌పిని దెబ్బతీసిందో చెప్పాల్సిన పని లేదు. అయితే అవన్నీ ఇప్పుడు అబద్దాలు అని తేలుతున్నా సరే వైసీపీ ఇంకా అదే పనిలో ఉంటుంది.

మళ్ళీ వాటిని కవర్ చేయడానికి కొత్త కొత్త ఎత్తులు వేస్తుంది. వివేకా హత్య కేసులో వైసీపీ అడ్డంగా బుక్ అయిపోయింది..అందులో ఎలాంటి డౌట్ లేదు..కానీ దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల ఎత్తులు వేస్తుంది. ఈ క్రమంలోనే వివేకా కుమార్తె సునీత వైసీపీలో చేరుతుందనే ప్రచారం చేస్తున్నారు. కడపలో సునీత టి‌డి‌పిలోకి వస్తున్నట్లు పోస్టర్లు కూడా వేస్తున్నారు. అంటే అసలు ఏ విధంగా వివేకా కేసుని డైవర్ట్ చేయడానికి వైసీపీ కష్టపడుతుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే దీన్ని టి‌డి‌పి ఇంకా సమర్ధవంతంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.

ఇక లోకేష్ అనని మాటలని అన్నట్లు క్రియేట్ చేశారు. దళితులకు జగన్ పీకింది ఏమి లేదని లోకేష్ అంటే..దళితులు పీకింది ఏమి లేదని వీడియో ఎడిట్ చేశారు. అలాగే చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో దళిత కార్డుతో వైసీపీ రాజకీయం చేస్తుంది. ఈ అంశాన్ని టి‌డి‌పి తిప్పికొట్టలేకపోతుంది. ఎంతసేపు చంద్రబాబు, లోకేష్ వివరణ ఇచ్చుకోవడం తప్ప..నేతలు పెద్ద ఎత్తున పోరాటం చేసి..వైసీపీ ఎత్తులని తిప్పికొట్టడం లేదు.

ఎప్పటినుంచో టి‌డి‌పి మద్ధతుదారుల ఓట్లు తొలగిస్తున్నారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు ఓటర్ల లిస్ట్ చెక్ చేయాలని చంద్రబాబు, టి‌డి‌పి నేతలకు చెబుతూనే ఉన్నారు. కానీ ఈ అంశంలో నేతలు అంత జాగ్రత్తగా ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా వైసీపీ ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తూ..ఎవరు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారో వారిని నోట్ చేసుకుని, వారి ఓట్లు లేపేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇలా వైసీపీ రకరకాల కుట్రలు చేస్తుంటే..టి‌డి‌పి  నేతలు పూర్తిగా వాటిని తిప్పికొట్టలేకపోతున్నారనే చెప్పాలి.