May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

వైసీపీ దళిత కార్డు..టోటల్ రివర్స్..టీడీపీకి నష్టమా.!

రాజకీయాల్లో నిజాలు కంటే అబద్దాలే ఎక్కువ ప్రచారం అవుతాయి. వాటి ద్వారా రాజకీయంగా లబ్ది పొందడానికి అధికార వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అసలు ఫేక్ ప్రచారం చేయడంలో వైసీపీని మించిన పార్టీ లేదనే చెప్పాలి. గత ఎన్నికల ముందు ఎన్ని రకాల అబద్దాలు, ఫేక్ ప్రచారం చేసి టి‌డి‌పిని దెబ్బకొట్టి అధికారంలోకి వచ్చారో చెప్పాల్సిన పని లేదు. ఇక అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ అదే పనిలో ఉంది. ఎక్కడకక్కడ ఫేక్ ప్రచారం చేస్తూనే ఉంది.

అయితే రాష్ట్రంలో టి‌డి‌పికి ఆదరణ పెరుగుతుంది. ఓ వైపు చంద్రబాబు పర్యటనలకు, మరోవైపు లోకేష్ పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజా స్పందన వస్తుంది. ఇదే క్రమంలో వివేకా, కోడి కత్తి కేసులు లాంటివి వైసీపీకి రివర్స్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ మొదలుపెట్టింది. మొన్ననే విశాఖలో సెప్టెంబర్ నుంచి కాపురం పెడతానని డైవర్షన్ గేమ్ మొదలుపెట్టారు.

ఇక తాజాగా వైసీపీ దళిత కార్డు ఎత్తుకుంది. అసలు దళితులు వైసీపీకి ఏ స్థాయిలో మద్ధతు ఇస్తారో తెలిసిందే. కానీ ఆ దళితులకు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒరిగింది లేదు..పైగా దళితులపై దాడులు పెరిగాయి..హత్యలు జరుగుతున్నాయి.. ఈ పరిణామాల నేపథ్యంలో దళితులు వైసీపీకి దూరంగా, టి‌డి‌పికి దగ్గరవుతున్నారు. దీంతో వైసీపీకి ధ్వేషం పెరిగినట్లు తెలిసింది. అందుకే ఒకే రోజు అటు లోకేష్ పాదయాత్ర, ఇటు చంద్రబాబు రోడ్ షోలని అడ్డుకునేందుకు వైసీపీ ప్లాన్ చేసింది. ఇక పాదయాత్రలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న లోకేష్..ప్రభుత్వం వల్ల ప్రజలు భారీగా నష్టపోతున్నారని చెబుతూనే..ఇటీవల జగన్..దళితులకు పీకింది ఏమి లేదని అన్నారు. అంటే దళితులకు జగన్ ఏం చేయలేదని.

అయితే దాన్ని వైసీపీ మార్చేసింది..దళితులు పీకింది ఏమి లేదని లోకేష్ అన్నారని వైసీపీ, వైసీపీ మీడియా క్రియేట్ చేసింది..దాన్ని  టి‌డి‌పి సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఆ అంశాన్ని అడ్డం పెట్టుకుని..తాజాగా ఆదోనిలో లోకేష్ పాదయాత్రలో వైసీపీ శ్రేణులు నిరసన తెలియజేశాయి. గో బ్యాక్ లోకేష్ అంటూ నినాదాలు చేశారు. ఇటు యర్రగొండపాలెంలో చంద్రబాబు రోడ్ షోలో..మంత్రి ఆదిమూలపు సురేష్ తన అనుచరులతో నిరసన తెలియజేశారు. గో బ్యాక్ బాబు అని నినాదాలు చేశారు. ఇక వీరికి పోలీసులు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అయితే ఇలా దళిత కార్డు వాడుకుని వైసీపీ చేసిన రాజకీ