దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే..అంతా ఏపీ పేరే చెబుతారు..ఎందుకంటే ఇంతవరకు రాష్ట్రానికంటూ ఒక రాజధాని లేకుండా పోయింది..ఇక ఇలాంటి పరిస్తితి రావడానికి కారణం కేవలం జగన్ ప్రభుత్వమే అని చెప్పాలి..రాష్ట్రం విడిపోయాక తప్పో, ఒప్పో గాని చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు..దానికి జగన్ కూడా ఒప్పుకున్నారు. అలాగే చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు అమరావతిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.

ఇక 2019 ఎన్నికల సమయంలో జగన్ రాజధాని మారుస్తానని చెప్పలేదు..పైగా వైసీపీ నేతలు రాజధాని అమరావతి అని ప్రచారం చేశారు. సరే ఇంకా జగన్ ఏదో రాజధాని గొప్పగా చేస్తారని చెప్పి…రాష్ట్ర ప్రజలు వైసీపీని గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ మూడు రాజధానులతో ట్విస్ట్ ఇచ్చారు…దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు..దీంతో ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చే పరిస్తితి వచ్చింది.

అటు అమరావతి రైతులు ఏమో రాజధాని కోసం ఉద్యమం మొదలుపెట్టారు..అలాగే అమరావతినే రాజధానిగా కోరుకున్న వారంతా కోర్టు మెట్లు ఎక్కారు..దీంతో జగన్ మూడు రాజధానులకు బ్రేక్ పడింది..చివరికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే విధంగా కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా సరే తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు…అధికార వికేంద్రీకరణ చేసి తీరుతామని అంటున్నారు. అధికారంలో బలంగా ఉన్నామని, పాలనను వికేంద్రీకరించాలన్నది జగన్ ఉద్దేశమని, తాము అనుకున్నదే చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో వికేంద్రీకరణతోనే ప్రజల్లోకి వెళ్లి వారి ఆశీర్వాదం కోరుతామని అన్నారు. అయితే ఈ పని ఏదో గత ఎన్నికల్లోనే చేస్తే బాగుండేది కదా అని ప్రత్యర్ధి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సరే నెక్స్ట్ ఎన్నికలకు మూడు రాజధానుల కాన్సెప్ట్‌తో వెళ్ళి గెలవాలని చెప్పి టీడీపీ శ్రేణులు సవాల్ విసురుతున్నాయి. అయితే మూడుతో ఎన్నికలకు వెళితే వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగేలా ఉంది. మరి చూడాలి వైసీపీ…మూడు ముచ్చట ఎప్పుడు తీరుతుందో?

Discussion about this post