ఒకప్పుడు రాజకీయం రాజకీయంగానే ఉండేది..ఎంతటి ప్రత్యర్ధులైన సరే ఫేస్ టూ ఫేస్ అన్నట్లే రాజకీయం నడిపేవారు. కానీ ఎప్పుడైతే రాజకీయాల్లో వ్యూహకర్తలు ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి రాజకీయం మారిపోయింది. ఫేక్ రాజకీయం మొదలైంది. అయితే ఏపీలో వైసీపీ ప్రశాంత్ కిషోర్‌ని వ్యూహకర్తగా పెట్టుకుని గత ఎన్నికల ముందు ఫేక్ రాజకీయం చేసి 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చాక పీకే టీంతోనే ఫేక్ పాలిటిక్స్ చేస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది.

ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లు క్రియేట్ చేసి ప్రత్యర్ధులని దెబ్బకొట్టడమే వైసీపీ టార్గెట్. అయితే గత ఎన్నికల ముందు వైసీపీ ఎత్తులు టీడీపీకి అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు వైసీపీకి ధీటుగానే టీడీపీ స్పందిస్తుంది. వైసీపీ ఏదైనా ఫేక్ రాజకీయం చేస్తే వెంటనే దాన్ని కనిపెట్టి అది ఫేక్ అని క్లియర్ గా వివరిస్తుంది. తాజాగా కూడా కందుకూరు బాధితులకు చంద్రబాబు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది.

ఇక వైసీపీ ప్రచారానికి టీడీపీ గట్టిగా కౌంటర్లు ఇచ్చింది. అసలు ఆ చెక్కులు ఎప్పుడో చెల్లాయని, వైసీపీ ఫేక్ సమాచారంతో టీడీపీపై బురద జల్లుతుందని విరుచుకుపడింది. కందుకూరు మృతుల కుటుంబాలకు టీడీపీ చేసిన ఆర్థికసాయంపై, దుష్ప్రచారం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. పార్టీపరంగా ఒక్కో కుటుంబానికి రూ.30లక్షల ఆర్థికసహాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన చెక్‌లు క్లియరై, బాధిత కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి అన్నారు. అయితే డబ్బులు వచ్చినట్లు బాధితులు కూడా చెప్పారు. కానీ వైసీపీ మాత్రం చెక్కులు బౌన్స్ అయ్యాయని ఫేక్ ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave feedback about this