గత కొన్ని ఎన్నికలుగా పరిస్తితి వేరు..ఈ సారి ఎన్నికల్లో పరిస్తితి వేరు. తెలుగుదేశం పార్టీకి ఊహించని ఫలితాలు వచ్చేలా ఉన్నాయి. దశాబ్దాల తరబడి ఓడిపోతూ వస్తున్న సీట్లలో టిడిపి అదిరిపోయే విజయాలు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్, తర్వాత వైసీపీ హవా నడుస్తున్న స్థానాల్లో టిడిపి జెండా ఎగిరేలా ఉంది.
అలాంటి స్థానాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరు కూడా ఒకటి. ఆలూరు అంటే టిడిపికి కలిసిరాని నియోజకవర్గం. ఇక్కడ టిడిపి చివరిగా గెలిచింది ఎప్పుడో తెలిస్తే షాక్ అవ్వడం గ్యారెంటీ..అంటే అక్కడ టిడిపి పరిస్తితి అలా ఉంది. ఆలూరులో మొదట అంటే టిడిపి ఆవిర్భావం సమయంలో జరిగిన 1983 ఎన్నికల్లో గెలిచింది. ఆ వెంటనే 1985లో ఓడిపోయింది. మళ్ళీ 1987 ఉపఎన్నికల్లో గెలిచింది. 1989లో ఓటమి పాలైంది. ఇక 1994 ఎన్నికల్లో అక్కడ టిడిపి చివరిగా గెలిచింది. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.

కానీ ఈ సారి ఎన్నికల్లో అక్కడ టిడిపి జెండా ఎగిరేలా ఉంది. గత రెండు ఎన్నికల్లో ఆలూరులో వైసీపీ నుంచి గుమ్మనూరు జయరాం గెలుస్తూ వస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి అయ్యారు..మధ్యలో కూడా పదవి పోలేదు. అనేక ఆరోపణలు వచ్చిన జగన్ ఆయన్ని తప్పించలేదు. కుల సమీకరణాలు చూసుకుని కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.
కానీ జయరాం మంత్రిగా ఫెయిల్..ఎమ్మెల్యేగా చేసేదేమీ లేదు. భూ కబ్జా, పేకాట క్లబ్బులు, ఇసుక దోపిడి, బెంజ్ కారు లంచం అంటూ ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే ఆయన్ని వ్యతిరేకించే పరిస్తితిలో ఉన్నారు. దీంతో ఆయన ఓటమి వెళుతున్నారు. టిడిపి నుంచి కోట్ల సుజాతమ్మ దూకుడుగా ఉన్నారు. ఆ మధ్య లోకేశ్ పాదయాత్ర కూడా టిడిపికి ప్లస్. మొత్తానికైతే ఆలూరులో ఈ సారి టిడిపి జెండా ఎగిరేలా ఉంది.