ఏపీ ప్రత్యేక హోదాపై డ్రామా నడుస్తూనే ఉంది…అటు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్న వైసీపీ…హోదా అంశంలో ఎటు తేల్చకుండా డ్రామాని మాత్రం రక్తికట్టిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఎలాగో హోదా అంశం ముగిసిన అధ్యాయం అని బీజేపీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే…అబ్బే తమకు 25కు 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెచ్చేస్తామని ఎన్నికల ముందు జగన్ చెప్పారు…సరే అని జగన్ ఏదో సాధించేస్తారని జనం…వైసీపీకి 22 మంది ఎంపీలు ఇచ్చారు. అయినా సరే కేంద్రంలో బీజేపీకి మెజారిటీ ఉంది మన వల్ల కాదు అని జగన్ చేతులెత్తేశారు.

అప్పటినుంచి హోదా అంశంలో వైసీపీ పోరాడింది ఏమి లేదు..కానీ తాజాగా కేంద్ర హోమ్ శాఖ..ఏపీ, తెలంగాణకు సంబంధించి 9 విభజన అంశాలపై చర్చ చేయడానికి సిద్ధమైంది. ఇందులో ప్రత్యేక హోదా అంశాన్ని కూడా మొదట పెట్టింది. దీంతో వైసీపీ వాళ్ళు ఎక్కడా ఆగలేదు…అదిగో హోదా వచ్చేస్తుంది…మన జగనన్న సాధించేసారని ప్రచారం చేశారు. తీరా సాయంత్రానికి హోదా అంశం చర్చలో లేదని లెటర్ వచ్చింది. కేవలం 5 అంశాలపైనే చర్చ జరుగుతుందని రెండు రాష్ట్రాలకు హోమ్ శాఖ లెటర్ ఇచ్చింది.

మరి ఈలోపు హోదాని ఎవరు తీయించారు…అసలు హోదా పెట్టకపోయినా వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేసిందా? అనేది ఎవరికి క్లారిటీ లేదు. అయితే వైసీపీకి ఎప్పటికప్పుడు గేమ్ ఆడటం బాగా వచ్చని చెప్పొచ్చు…హోదా పెడితే మా జగనన్న సాధించారని హడావిడి చేసి, హోదా తీసేయగానే…అదిగో చంద్రబాబు మేనేజ్ చేసి, హోదాని తీయించారని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది.

అంటే కేంద్ర హోమ్ శాఖనే మేనేజ్ చేసే కెపాసిటీ బాబుకు ఉందని వైసీపీ బాగా కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు ఉంది…అసలు చంద్రబాబుకు కేంద్రాన్ని మేనేజ్ చేసే సత్తా ఉంటే…ఇలా తిప్పలు పడాల్సిన అవసరం కూడా ఉండదు…కానీ వైసీపీ ఏదో కావాలని ప్రచారం చేస్తుంది గాని…ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్తితుల్లో లేరు.

Discussion about this post